రామ్ చరణ్- అల్లు అర్జున్.. ఈ సారికి లేనట్టే! | No Movie Updates On Ram Charan And Allu Arjun Birthday, Read Full Story For More Details | Sakshi
Sakshi News home page

నో అప్డేట్స్.. అభిమానులకు నిరాశ తప్పదేమో!

Mar 23 2025 5:57 PM | Updated on Mar 23 2025 6:22 PM

No Movie Updates On Ram Charan And Allu Arjun Birthday

ప్రస్తుతం రామ్ చరణ్, అల్లు అర్జున్ (Allu Arjun).. పాన్ ఇండియా హీరోలుగా పుల్ క్రేజ్ సంపాదించారు. చరణ్ (Ram Charan) ప్రస్తుతం ఓ మూవీ చేస్తున్నాడు. మరో మూవీ లైనులో ఉంది. బన్నీ కూడా రెండు సినిమాల కోసం సిద్ధమవుతున్నాడు. సరిగ్గా ఇలాంటి టైంలో ఓ బ్యాడ్ న్యూస్ అభిమానుల మధ్య చర్చకు కారణమవుతోంది.

హీరోలన్నాక సినిమాలు చేస్తుంటారు. మంచి రోజులు చూసుకుని అప్డేట్స్ ఇస్తుంటారు. ఇక పుట్టినరోజున గ్లింప్స్, పోస్టర్స్ లాంటివి రిలీజ్ చేస్తుంటారు. త్వరలో చరణ్ (మార్చి 27), బన్నీ (ఏప్రిల్ 8) బర్త్ డేలు రాబోతున్నాయి. దీంతో కొత్త మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ ఈసారి అలాంటివేం ఉండవని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: వీడియో: దుబాయిలోని హిందూ దేవాలయంలో అల్లు అర్జున్)

చరణ్-బుచ్చిబాబు సినిమాకు ఏఆర్ రెహమాన్ (Ar Rahman) సంగీత దర్శకుడు. కొన్నిరోజుల క్రితం ఈయన గుండెల్లో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరారు. డిశ్చార్జ్ కూడా అయిపోయి ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే గ్లింప్స్ విజువల్స్ రెడీ అయిపోయినా సరే మ్యూజిక్ బాకీ ఉండటంతో చరణ్ పుట్టినరోజు దీన్ని రిలీజ్ చేయడం కష్టమేనని మాట్లాడుకుంటున్నారు.

మరోవైపు అల్లు అర్జున్ కొత్త మూవీస్ కి సంబంధించి పుట్టినరోజున అనౌన్స్ మెంట్స్ ఉండొచ్చని అనుకున్నారు. కానీ బన్నీ నానమ్మ ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సినిమాల ప్రకటన సరికాదని, వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఈ రూమర్స్ బట్టి చూస్తే త్వరలో మంచి రోజు చూసుకుని చరణ్, బన్నీ మూవీస్ అప్డేట్స్ రిలీజ్ చేస్తారనిపిస్తుంది.

(ఇదీ చదవండి: వెంటిలేటర్ పై అల్లు అర్జున్ నానమ్మ.. ఇప్పుడు ఎలా ఉందంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement