నేరుగా ఓటీటీకి నయనతార మూవీ, అప్పటి నుంచే స్ట్రీమింగ్‌ | Nayanthara O2 Movie Streaming On Disney Plus Hotstar From 17th June | Sakshi
Sakshi News home page

Nayanthara-O2 Movie: నేరుగా ఓటీటీకి నయన్‌ మూవీ, అప్పటి నుంచే స్ట్రీమింగ్‌

Jun 16 2022 6:41 PM | Updated on Jun 16 2022 6:41 PM

Nayanthara O2 Movie Streaming On Disney Plus Hotstar From 17th June - Sakshi

లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార గ్యాప్‌ లేకుండా విభిన్న చిత్రాలతో అలరిస్తోంది. అనామిక, కర్తవ్యం వంటి హీరోయిన్‌ సింట్రిక్‌ పాత్రల్లో మెప్పించిన నయన్‌ ఇటీవల 'కణ్మనీ రాంబో ఖతీజా' మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఇప్పుడు ఆమె తాజాగా 'ఓ2' (O2) సినిమాతో ఆడియెన్స్‌ను థ్రిల్‌ చేసేందుకు రెడీ అయ్యింది.  జీఎస్.విక్నేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుద‌ల కాబోతోంది. మే 17న ఈ మూవీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ స్ట్రీమింగ్‌ సిద్దమైంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కాబోతోంది ఈ థ్రిల్లర్‌ డ్రామా. ఈ చిత్రంలో న‌య‌న‌తార ఎనిమిదేళ్ళ బాబుకు త‌ల్లిగా న‌టించింది. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఎస్ఆర్ ప్ర‌కాష్ బాబు, ఎస్ఆర్ ప్ర‌భు ఈ చిత్రాన్ని నిర్మించారు.

చదవండి: మాజీ భర్త హృతిక్‌ గర్ల్‌ఫ్రెండ్‌ పోస్ట్‌పై సుసానే ఆసక్తికర కామెంట్‌

రిత్విక్‌, లీనా, మ‌నోహ‌ర్‌, అడ‌కులం మురుగ‌దాస్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రం త‌మిళంతో పాటు తెలుగు, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల కానుంది. కాగా ఇటీవల నయన్‌ తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ జూన్‌ 9న పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం రిలీజ్‌ అవుతున్న నయన్‌ తొలి సినిమా ఇదే కావడంలో దీనిపై ఆసక్తి నెలకొంది. ఈ విభిన్న కథలతో ప్రేక్షకుల అలరించిన నయన్‌ ఈ మూవీతో ఎంతమేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. కాగా నయనతార ప్రస్తుతం చిరంజీవి 'గాడ్‌ ఫాదర్‌', 'గోల్డ్' తదితర చిత్రాల్లో నటిస్తోంది. 

చదవండి: ఆ నిర్మాత నన్ను నా ఫ్యామిలీని బెదిరించాడు: చాందిని చౌదరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement