Sussanne Khan-Saba Azad: మాజీ భర్త హృతిక్‌ గర్ల్‌ఫ్రెండ్‌ పోస్ట్‌పై సుసానే ఆసక్తికర కామెంట్‌

Sussanne Khan Calls With Nickname Hrithik Roshan Girlfriend Saba Azad - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ విడాకుల అనంతరం యంగ్‌ నటి సబా ఆజాద్‌తో డేటింగ్‌ చేస్తున్నాడే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయినప్పటికీ హృతిక్‌, సబా ఈ రూమర్లపై ఇప్పటి వరకు నోరు విప్పలేదు. తరచూ వీరిద్దరు ముంబై రోడ్లపై చట్టపట్టాలేసుకుని తిరగడం,  డిన్నర్‌ డేట్స్‌కు,  జంటగా పార్టీలకు హజరవుతున్నారు. దీంతో ఈ వార్తలు నిజమే అంటూ బి-టౌన్‌లో గుసగులాడుకుంటున్నారు. మరోపక్క హృతిక్‌ మాజీ భార్య సుసానే ఖాన్‌ కూడా మరో నటుడితో ప్రేమలో మునిగి తేలుతున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.

చదవండి: ఆ నిర్మాత నన్ను నా ఫ్యామిలీని బెదిరించాడు: చాందిని చౌదరి

తరచూ ఆమె, నటుడు అర్స్లాన్ గోనితో చట్టాపట్టాలేసుకుని ముంబై రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు. అంతేకాదు ఈ మాజీ కపుల్స్‌ తమ కొత్త పార్ట్‌నర్స్‌తో ఒకే పార్టీలో సందడి చేస్తున్నారు. వారి తీరు చూసి అంతా ముక్కున వేలేసుకుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా తన మాజీ భర్త రూమర్డ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ను సుసానే నిక్‌ నేమ్‌తో పిలిచి అందరికి షాకిచ్చింది. ఇటీవల సబా ఆజాద్‌ షేర్‌ చేసిన ఓ పోస్ట్‌పై సుసానే కామెంట్‌ చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. సబా మిర్రర్‌ ముందు హోయలు పోతున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.

చదవండి: ట్రోలర్స్‌కు షాకిచ్చిన ప్రభాస్‌, స్టైలిష్‌ లుక్‌లో ‘డార్లింగ్‌’

‘దీనికి సరిపోయే స్మార్ట్‌ క్యాప్షన్‌ ఏంటో రావడం లేదు’ అంటూ పంచుకుంది. ఇక ఈ పోస్ట్‌పై సుసానే స్పందిస్తూ ‘వావ్‌ సబూ.. హాట్‌గా ఉన్నావ్‌’ అంటూ కామెంట్‌ చేసింది. తన మాజీ భర్త గర్ల్‌ఫ్రెండ్‌ పోస్ట్‌కు ససానే ఈ విధంగా స్పందించడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఆమె రియాక్షన్‌ చూసి పలువురు షాకవడమే కాకుండా.. సబాకు నిక్‌ నేమ్‌ కూడా పెట్టిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా ఇటీవల ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ 50వ బర్త్‌డేకు హృతిక్‌, సబాతో జంటగా హజరయ్యాడు. ఈ సందర్భంగా సబాను తన గర్ల్‌ఫ్రెండ్‌ అంటూ పరిచయం చేసినట్లు సమాచారం.    

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top