Nani Speech At Shyam Singha Roy Pre Release Event - Sakshi
Sakshi News home page

Nani: ఫ్యాన్స్‌ అన్న మాటలకు నా భార్య 10 సూట్స్‌ కొని పెట్టింది

Dec 19 2021 7:58 AM | Updated on Dec 19 2021 10:59 AM

Nani Speech At Shyam Singha Roy Pre Release Event - Sakshi

Nani Speech At Shyam Singha Roy Pre Release Event: ‘‘సినిమా ఫంక్షన్స్‌లో ఎప్పుడూ వైట్‌ డ్రెసెస్‌లోనే కనిపిస్తుంటానని నా అభిమానులు కొందరు సోషల్‌ మీడియా ద్వారా చెప్పారు. దీంతో నా భార్య నా కోసం పది సూట్స్‌ కొనిపెట్టింది. వాటిని ఎప్పుడు వేసుకోవాలనుకున్నా ‘నేను ఏం చేశానని వేసుకోవాలి?’ అనుకునేవాణ్ణి. ఇప్పుడు ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమా చేసి, చూసుకుని సూట్‌ వేసుకుని ఇక్కడికి ధైర్యంగా వచ్చాను. ఈ సినిమాతో సూట్‌ వేసుకునే అర్హత వచ్చిందనుకున్నాను’’ అని నాని అన్నారు. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. ఇందులో సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోనా సెబాస్టియన్‌  హీరోయిన్స్‌గా నటించారు.

వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో నాని మాట్లాడుతూ– ‘‘శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్రంపై పూర్తి నమ్మకంతోనే ఉన్నాం. సాయిపల్లవి మాట్లాడుతూ ఎందుకు అంత ఎమోషనల్‌ అయ్యారో సినిమా చూస్తే తెలుస్తుంది. రాహుల్‌ నుంచి ‘శ్యామ్‌ సింగరాయ్‌’ రూపంలో మంచి సర్‌ప్రైజ్‌ ఉంది. వెంకట్‌గారితో కలిసి ఇలాంటి సినిమా చేసినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు.

‘‘నాలోని పిరికితనాన్ని పాతరేసి నాకు ధైర్యం చెప్పిన గురువుగారు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు. ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి’ అంటూ పాట రాసిన నాకు భయపడే హక్కు లేదు. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ అంటూ ఓ క్యారెక్టర్‌ను ప్రపంచానికి చెబుతున్న నీకు భయపడే అవసరం లేదు.. గుర్తు పెట్టుకో’ అని సీతారామశాస్త్రిగారు అన్నారు. వందకోట్ల బడ్జెట్‌ ఇవ్వలేని నమ్మకం నానిగారు ఇచ్చారు’’అన్నారు రాహుల్‌ సంకృత్యాన్‌. ‘‘యాక్టర్, డ్యాన్సర్‌ కావాలని చాలామందికి ఉంటుంది.. కానీ అందరికీ అవకాశాలు రావు. నన్ను నమ్మి నాకు అవకాశాలు ఇస్తున్న దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు.

ఆస్కార్‌ లేదా జాతీయస్థాయి అవార్డు వచ్చినప్పుడు నేను ఎమోషనల్‌ అవుతానేమోనని అనుకున్నాను. కానీ ఓ యాక్టర్‌గా ఈ ఆర్ట్‌ ఫామ్‌లో ఉండటమే నాకు పెద్ద అవార్డు’’అంటూ భావోద్వేగానికి లోనయ్యారు సాయి పల్లవి. ‘‘నేను చేసిన కీర్తి పాత్ర యూత్‌కు కనెక్ట్‌ అవుతుంది’’ అన్నారు కృతీశెట్టి. ‘‘శ్యామ్‌ సింగరాయ్‌’ టీమ్‌తో వర్క్‌ చేయడం నాకు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్‌’’ అన్నారు మడోనా. ‘‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమా అందరికీ నచ్చుతుంది.. తప్పకుండా థియేటర్స్‌లో చూడండి’’ అన్నారు వెంకట్‌ బోయనపల్లి.  

Advertisement
 
Advertisement
Advertisement