
బిగ్‌బాస్ కొత్త సీజన్ త్వరలో మొదలుకానుంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి చిన్న చిన్న మార్పులు ఉండేలా కనిపిస్తున్నాయి. లేటెస్ట్‌గా వచ్చిన టీజర్‌లో నాగ్ మాట్లాడుతూ.. ఈసారి రెండు హౌసులు, సరికొత్త టాస్కులు ఉంటాయని చెప్పాడు. అలానే బిగ్‌బాస్ ఉండట్లేదన్నట్లు మాట్లాడాడు. మరి ఏం మార్చారనే సంగతి పక్కనబెడితే ఈసారి నాగ్ రెమ్యునరేషన్ పెంచేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎన్ని కోట్లు ఇవ్వబోతున్నారు? ఏంటి సంగతి?
ఇప్పటివరకు 8 సీజన్లు జరిగాయి. అయితే గత రెండు సీజన్ల విషయమై షోపై చాలా విమర్శలు వచ్చాయి. దీంతో ఈసారి సామాన్యులని ముగ్గురుని ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం ఆగస్టు 22 నుంచి 'అగ్నిపరీక్ష' పేరుతో కొన్ని గేమ్స్ నిర్వహించనున్నారు. వీటిలో పాల్గొనే 40 మంది నుంచి ముగ్గురిని ఎంపిక చేస్తారు. వీళ్లు.. సెప్టెంబరు తొలి లేదా రెండోవారంలో మొదలయ్యే షోలో కంటెస్టెంట్స్‌గా పాల్గొంటారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మ్యాడ్' హీరో కొత్త సినిమా)
ప్రస్తుతానికి కమెడియన్ ఇమ్మాన్యుయేల్, చిట్టి పికిల్స్ రమ్య మోక్షతో పాటు పలువురు సీరియల్ బ్యూటీస్ పేర్లు లిస్టులో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. షో మొదలయ్యేంత వరకు క్లారిటీగా చెప్పలేం. అసలు విషయానికొస్తే.. తొలి రెండు సీజన్లు వరసగా ఎన్టీఆర్, నాని చేయగా మూడో సీజన్ నుంచి మాత్రం నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్నారు. అప్పట్లో మంచి ఎనర్జిటిక్‌గా హోస్ట్ చేసేవారు గానీ గత కొన్ని సీజన్ల నుంచి మాత్రం నాగ్ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి.
ఇకపోతే గత సీజన్ కోసం రూ.15-20 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్న నాగ్.. ఈసారి 9వ సీజన్ కోసం మాత్రం రూ.30 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం డబుల్ ధమాకా జాక్‌పాట్ దక్కినట్లే. ఏదేమైనా ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
(ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వ వాహనంలో హీరోయిన్ నిధి అగర్వాల్ షికార్లు)