సీఎం జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన హీరో నాగార్జున | Sakshi
Sakshi News home page

ఏపీ సీఎం జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన హీరో నాగార్జున

Published Thu, Dec 21 2023 2:11 PM

Nagarjuna Akkineni Birthday Wishes To YS Jagan - Sakshi

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌ రెడ్డి నేడు (డిసెంబర్‌ 21) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  ఇప్పటికే వైసీపీ నేతలు జగన్‌ పుట్టినరోజును ఎంతో ఘణంగా జరుపుతున్నారు.

తాజాగా సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన కోరారు. ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని అక్కినేని నాగార్జున ఆకాంక్షించారు. జగన్‌కు శుభకాంక్షలు తెలుపుతూ తన ఎక్స్‌ పేజీలో నాగార్జున ఒక పోస్ట్‌ చేశారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ కూడా సీఎం జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నేడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టాయి. 

Advertisement
 
Advertisement