డ్రగ్స్‌ కేసు: పార్లమెంట్‌లో గళమెత్తిన ఎంపీ రవికిషన్‌

MP Ravi Kishan Comments Over Bollywood Drug Connection In Parliamentary Sessions - Sakshi

న్యూఢిల్లీ : డ్రగ్స్‌ కేసుతో బాలీవుడ్‌కు ఉన్న సంబంధాలపై నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ‌( రేసుగుర్రం విలన్‌ మద్దాలి శివారెడ్డి) గళమెత్తారు. బాలీవుడ్‌లో మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. దేశ యువతను నాశనం చేయటానికి కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. పొరుగుదేశాలు ఇందుకు సహకారం అందిస్తున్నాయన్నారు. సోమవారం నాటి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్‌, చైనాలనుంచి ప్రతి ఏటా మత్తు పదార్థాలు దేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్నాయని, నేపాల్‌, పంజాబ్‌ ద్వారా దేశంలోకి వస్తున్నాయని పేర్కొన్నారు. ( డ్రగ్స్‌‌ కేసు: రాగిణి ద్వివేదీ చీటింగ్‌ )

డ్రగ్స్‌ కేసుతో సంబంధం ఉన్న కొంతమందిని అరెస్ట్‌ చేసి, ఎన్‌సీబీ మంచి పనిచేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని, కేసుతో సంబంధం ఉన్న మిగిలిన దోషులను వెంటనే పట్టుకుని శిక్షించాలని కోరారు. పొరుగు దేశాల కుట్రకు శుభం కార్డు వేయాలన్నారు. ( ‘ఏయ్‌.. నేను నిజంగానే ఎంపీ అయ్యాను’)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top