
ప్రేక్షకుల్ని మెప్పించడం, వరుస విజయాలు అందుకోవడం అంత ఈజీ కాదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంటారు. కానీ ఈ సీనియర్ హీరో మాత్రం అదంతా తనకు మామూలు విషయం అన్నట్లుగా వరుస హిట్లతో స్పీడుమీదున్నాడు. ఆయనే మలయాళ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal).
2025లో ఇప్పటివరకు మూడు హిట్స్
మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం హృదయపూర్వం. సత్యన్ అంతికడ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ వెల్లడించింది. దీనికంటే ముందు మోహన్‌లాల్ ఈ ఏడాది ఎంపురాన్ (లూసిఫర్ సీక్వెల్), తుడరుమ్ సినిమాలతో పలకరించాడు. ఈ రెండు కూడా మంచి విజయాలే అందుకున్నాయి. కేవలం రూ.28 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన తుడరుమ్ ఏకంగా రూ.230 కోట్లు వసూలు చేసింది.

హృదయపూర్వం సినిమా స్టిల్
మలయాళ ఇండస్ట్రీలోనే అత్యధికం
రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఎంపురాన్ ఏకంగా రూ.260 కోట్లు సాధించింది. మలయాళ చరిత్రలోనే రూ.250 కోట్లు దాటిన మొట్టమొదటి చిత్రంగా ఎంపురాన్ రికార్డు సృష్టించింది. ఓపక్క హీరోలు ఒక్క హిట్టు కోసం పరితపిస్తుంటే.. మోహన్‌లాల్ మాత్రం కేవలం ఆరు నెలల్లోనే వరుసగా మూడు హిట్లు సాధించి అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు.
నెక్స్ట్ ఏంటి?
మోహన్‌లాల్ నెక్స్ట్ మూవీ ‘వృషభ’ ఈ ఏడాది అక్టోబరు 16న రిలీజ్ కానుంది. ఇందులో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక కీలక పాత్ర పోషించాడు. ఈ పాన్ ఇండియా సినిమాకు నందకిశోర్ దర్శకత్వం వహించారు. అలాగే సూపర్ హిట్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ 'దృశ్యం పార్ట్ 3'లోనూ మోహన్‌లాల్ భాగం కానున్నాడు. ఈ మూవీ వచ్చే నెలలోనే ప్రారంభం కానుంది.