Chiranjeevi Watch Cost: హాట్‌టాపిక్‌గా చిరు వాచీల కాస్ట్‌? వాటి ధరెంతో తెలుసా?

Megastar Chiranjeevi Watches Cost Goes Viral in Social Media - Sakshi

సెలబ్రిటీలు ఏం చేసినా అది వార్తే అవుతుంది. ఏది తిన్నా, ఎటు వెళ్లినా, ఏం ధరించినా అది సెన్సెషనల్‌ టాపిక్‌గా మారుతుంది. ఇటు అభిమానులు సైతం తాము ఇష్టపడే స్టార్‌ల లైఫ్‌స్టైల్‌ను ఇంట్రెస్ట్‌గా అబ్జర్వ్‌ చేస్తుంటారు. ఈ క్రమంలో వారు వాడే కార్లు, దుస్తులు, వాచ్‌ బ్రాండ్‌లను, వాటి ధరల గురించి సెర్చ్‌ చేస్తుంటారు. ఇక ఎక్కువ బ్రాండ్‌ విషయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ తరచూ వార్తల్లో నిలస్తుంటాడు. ఇక రామ్‌ చరణ్‌కు వాచ్‌లు అంటే పిచ్చి.. ఇప్పటికే రకరకాల టాప్‌ బ్రాండ్‌ వాచ్‌లను తన కలెక్షన్స్‌లో చేర్చేశాడు.

చదవండి: అప్పట్లో సంచలనమైన మాధురీ లిప్‌లాక్‌, అత్యంత కాస్ట్లీ కిస్‌ ఇదేనట!

ఇక తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి వాచ్‌ ధర హాట్‌టాపిక్‌గా మారింది. రీసెంట్‌గా చిరు నటించిన గాడ్‌ ఫాదర్‌, వాల్తేరు వీరయ్య చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో ఆయన తరచూ మూవీ ఈవెంట్స్‌లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయన చేతికి రకరకాల బ్రాండ్‌ వాచ్‌లు దర్శనం ఇస్తున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్‌ కన్ను వాటిపై పడింది. దీంతో మెగాస్టార్‌ వాడుతున్న ఆ వాచీల బ్రాండ్స్‌, వాటి ధర గురించి ఆరా తీస్తున్నారు. దీంతో చిరు వాచ్‌ ధరలను చూసి అభిమానులంతా నోరేళ్ల బెడుతున్నారట. చిరు దగ్గర ఎన్నో బ్రాండ్‌ వాచీలు ఉన్నాయట.

చదవండి: లవ్‌టుడే హీరోపై రజనీకాంత్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం! ట్వీట్‌కి లైక్‌ కొడతావా? అంటూ ఫైర్‌

అందులో రోలేక్‌ వాచ్‌ అత్యంత కాస్ట్లీ అని తెలుస్తోంది. రోలెక్స్ కంపెనీకి చెందిన కాస్మోగ్రఫీ డేటోనా వైట్ టైగర్ వాచ్ ధర అక్షరాలా 1 కోటీ 86 లక్షల 91 వేలకు పైనే ఉంటుందని సమాచారం. ఇక మెగాస్టార్ చిరంజీవి వాడే మరో వాచ్ కూడా ఉంది. ఎ లాంగే అండ్‌ సోహ్నే వాచ్.. లాంగే కంపెనీకి చెందిన ఈ వాచ్ ధర దాదాపు  రూ. 33 లక్షల 77వేల పైనే ఉంటుందట. దీంతో చిరు వాచీల ధరలను చూసి అంతా అవాక్కావుతున్నారట. ఆయన ఒక్క వాచీ జీవితమంత లగ్జరీగా బతికేయచ్చంటూ నెటిజన్లు ఫన్నిగా కామెంట్స్‌ చేస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top