Dancing Rose: అంత కష్టపడ్డాడు గనుకే ఆ రోల్‌కు అంత గుర్తింపు!

Meet Dancing Rose Actor Shabeer Kallarakkal In Arya Sarpatta Parambarai - Sakshi

తెరపై ఎంత సేపు కనిపించామన్నది కాదు.. ఆడియెన్స్‌-వ్యూయర్స్‌పై ఎంత ఇంపాక్ట్ చూపించామన్నది ముఖ్యం. ఫ్యామిలీ మ్యాన్‌ ‘చెల్లం’సర్‌ లాంటి కొన్ని క్యారెక్టర్లు ఈ విషయాన్ని ప్రూవ్‌ చేస్తూ వస్తున్నాయి. తాజాగా అలాంటి ఇంపాక్ట్ చూపించిన మరో క్యారెక్టర్‌.. డ్యాన్సింగ్‌ రోజ్‌. పా రంజిత్‌ డైరెక్షన్‌లో అమెజాన్‌ ప్రైమ్‌లో లేటెస్ట్‌గా రిలీజ్‌ అయ్యింది ‘సార్పట్ట పరంపర’(సార్పట్ట పరంబరై). ఈ సినిమాలో ఈ ‘డ్యాన్సింగ్‌ రోజ్‌’ అనే క్యారెక్టర్‌కి ప్రాధాన్యత పదిహేను నిమిషాలు ఉంటుంది. కానీ, ఆ క్యారెక్టర్‌ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దాడు పా రంజిత్‌.

స్లిమ్‌ ఫిట్‌ బాడీ, నుదుట రింగు, విచిత్రంగా మెలికలు తిరుగుతూ వేసే స్టెప్పులు. రింగ్‌లో ఊగిపోతూ ఓడిపోతున్నట్లుగా ప్రత్యర్థులను భ్రమపెట్టి, కాళ్ల వేగంతో కన్ఫ్యూజ్‌ చేసి బాక్సింగ్‌లో గెలుపు సాధించే క్యారెక్టర్‌ డ్యాన్సింగ్‌ రోజ్‌ది. అయితే డ్యాన్సింగ్‌ రోజ్‌కి ఓ క్యారెక్టర్‌ అంటూ ఉంటుంది. సమర(కబిలన్‌)తో ఓడినప్పటికీ, విలన్‌ బ్యాచ్‌లో  ఉన్నప్పటికీ.. నీతి తప్పడు. పైగా క్లైమాక్స్‌ పోటీకి ముందు వేటపులి(వేంబులి)కి హితబోధ కూడా చేస్తాడు. అందుకే చాలామందికి ఈ పాత్ర బాగా కనెక్ట్‌ అయ్యింది. ఇంతకీ ఈ క్యారెక్టర్‌ చేసింది ఎవరంటే.. చెన్నై థియేటర్‌ ఆర్టిస్ట్‌ షబీర్‌ కళ్ళరక్కల్‌.

మాంచి థియేటర్‌ ఆర్టిస్ట్‌
2009 నుంచి నటన వైపు అడుగులేశాడు నటుడు షబీర్‌ కళ్ళరక్కల్‌. యాభైకి పైగా స్టేజ్‌ షోలతో థియేటర్‌ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆపై  ‘నెరుంగి వా ముథమిడతే’(2014) హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు షబీర్‌. కానీ, ఆ తర్వాత అవకాశాలే పెద్దగా రాలేదు. దీంతో ‘అడంగ మరు, పెట్టా, టెడ్డీ’ లాంటి పెద్దసినిమాల్లో చిన్నరోల్స్‌ చేశాడు. షబీర్‌ స్వతహాగా ఫిట్‌నెస్‌ ప్రియుడు. దీంతో కాస్టింగ్‌ డైరెక్టర్‌ నిత్య.. సార్పట్ట అడిషన్స్‌కు వెళ్లమని సలహా ఇచ్చింది. అలా క్యారెక్టర్‌ దక్కింది. ఫిట్‌నెస్‌ ఉన్నోడు కావడంతో మార్షల్‌ ఆర్ట్స్‌ కళలో శిక్షణ తీసుకోగలిగాడు. స్టంట్‌ మాస్టర్‌ తిరు నేతృత్వంలో.. రకరకాల కళలను సులువుగా అవపోసన పట్టగలిగాడు. అంత కష్టపడ్డాడు గనుకే డ్యాన్సింగ్‌ రోజ్‌ సీక్వెన్స్‌లన్నీ అంతగా పేలాయి. ఇక అతను పడ్డ కష్టం తాలుకా వీడియోను చూసేయండి.

అన్నట్లు డ్యాన్సింగ్‌ రోజ్‌కు ఇన్‌స్పిరేషన్‌.. యూకే బాక్సింగ్‌ లెజెండ్‌ నసీమ్‌ హమెద్‌. ఆయన ఎంట్రీ దగ్గరి నుంచి రింగ్‌లో కదలికల దాకా అంతా విచిత్రంగా ఉంటుంది. 1992-2002 మధ్య ప్రొఫెసనల్‌ బాక్సర్‌గా కొనసాగిన నసీమ్‌.. 37 ఫైటింగ్‌ల్లో ఒక్కటంటే ఒక్కటి మాత్రమే ఓడిపోయాడు. ఐదున్నర అడుగుల ఎత్తుండే ప్రిన్స్‌..  క్యారెక్టర్‌ స్ఫూ‍ర్తితో జపనీస్‌ మాంగా సిరీస్‌ ‘హజెమె నో ఇప్పో’లో అమెరికన్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌ బ్రయాన్‌ హక్‌ క్యారెక్టర్‌ను సైతం తీర్చిదిద్దారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top