'పదహారువందల మందిని ప్రేమించా'

Mass Ka Dass Vishwak Sen Birthday Celebrations - Sakshi

‘‘ఈ నగరానికి ఏమైంది’, ‘హిట్‌’, ‘ఫలక్‌నుమాదాస్‌’.. ఇలా నా ప్రతి చిత్రంలో ఓ డైలాగ్‌ పేలింది. నా కొత్త చిత్రం ‘పాగల్‌’ నుంచి కూడా ఓ కొత్త స్లోగన్ ‌వస్తుంది. సినిమా మీద ఎంతో నమ్మకంతో ఉన్నాం. ఎంత బెట్‌ వేసుకుంటారో వేసుకోండి. ‘పాగల్‌’ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది’’ అన్నారు విష్వక్‌సేన్‌. నరేష్‌ కుప్పిలి దర్శకత్వంలో విష్వక్‌ సేన్‌ హీరోగా నటించిన చిత్రం ‘పాగల్‌’. ‘దిల్‌’ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్‌ నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. సోమవారం విష్వక్‌ సేన్‌ బర్త్‌డే.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో విష్వక్‌ సేన్‌ మాట్లాడుతూ– ‘‘పాగల్‌’ సినిమా గురించి ఏప్రిల్‌ 1 నుంచి వారానికో పాట విడుదలవుతుంది. ఇందులో నేను 1600మంది అమ్మాయిలను ప్రేమిస్తాను. అది కూడా సరిపోలేదు. ఏప్రిల్‌ 12 నుంచి ‘పాగల్‌’ లవ్‌యాత్రను తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించబోతున్నాం’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో తేజ్జా, హీరోయిన్‌ సిమ్రాన్‌ చౌదరి, డైరెక్టర్‌ అశ్వంత్, డీఓపీ విద్యాసాగర్, డైరెక్టర్‌ సాహిత్, రవికిరణ్, రచ్చ రవి, బల్వీందర్‌సింగ్, మేఘలేఖ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top