
'వెంకీ' సినిమాలో హీరో రవితేజ ఫ్రెండ్‌గా నటించి ఆకట్టుకున్న కమెడియన్ రామచంద్ర. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'నిన్ను చూడాలని' సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఆనందం, సొంతం, వెంకీ, కింగ్, దుబాయి శీను, లౌక్యం తదితర చిత్రాల్లో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓవరాల్ కెరీర్‌లో 100కి పైగా చిత్రాల్లో నటించారు.
అయితే ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం అతను మంచం పైనుంచి కదల్లేని స్థితిలో ఉన్నాడు. పెరాలసిస్ సోకడంతో పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. తన తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారని, తన తమ్ముడే బాగోగులు చూసుకుంటున్నాడని రామచంద్ర వెల్లడించారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న రామచంద్రను టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కలిశారు. అతని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వైద్య చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. అతని పరిస్థితిని చూసిన మనోజ్ చలించిపోయారు. సినీ ఇండస్ట్రీ తరఫున తన సాయం అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
#ManchuManoj met comedian Ramachandra, who is going through health issues related to paralysis.pic.twitter.com/M84yGNvZoM
— Filmy Bowl (@FilmyBowl) September 1, 2025