
జబర్దస్త్ కామెడీ షో ఫేమ్ తెచ్చుకున్న సుడిగాలి సుధీర్.. ఆ తర్వాత హీరోగానూ ఎంట్రీ ఇచ్చాడు. సాఫ్ట్‌వేర్ సుధీర్, గాలోడు లాంటి చిత్రాలతో మెప్పించాడు. తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించాడు. తన కెరీర్‌లో వస్తోన్న ఐదో చిత్రానికి హైలెస్సో అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిల్‌తో పాటు పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఈ మూవీకి కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటాషా సింగ్, నక్ష శరణ్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. ఈ నాలుగు భాషల్లోనూ రిలీజ్ చేసిన మూవీ పోస్టర్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాతో సుడిగాలి సుధీర్ పాన్ ఇండియా హీరోగా మారనున్నారు.
An arrival of our holy diety in her fierce avatar ❤️🔥@sudheeranand's next #SS5 titled as #HaiLesso 🔥
A divine & rooted tale of our culture is coming to thrill you all 🙏💥
Shoot begins soon⌛️
In Telugu, Tamil, Malayalam & Kannada✨
Directed by @iamkumarkota
Produced by… pic.twitter.com/KtYZR7LyD0— Sudigali Sudheer (@sudheeranand) September 29, 2025