మనం లాంటి అనుభూతి కలుగుతుంది  – సుధీర్‌ బాబు  | Sakshi
Sakshi News home page

మనం లాంటి అనుభూతి కలుగుతుంది  – సుధీర్‌ బాబు 

Published Fri, Sep 29 2023 12:41 AM

Mama Mascheendra Movie Trailer Launch - Sakshi

‘‘మామా మశ్చీంద్ర’లో త్రిపాత్రాభినయం చేశాను. ఏయన్నార్‌ ఫ్యామిలీ నటించిన ‘మనం’ చూసినప్పుడు అరుదైన సినిమాగా ఎలా అనుభూతి చెందారో, ‘మామా మశ్చీంద్ర’ చూశాక అలాంటి అనుభూతే కలుగుతుంది. ఈ సినిమాతో హర్షవర్ధన్‌ టాప్‌ డైరెక్టర్‌ అవుతారు’’ అన్నారు సుధీర్‌ బాబు. హర్షవర్ధన్‌ దర్శకత్వంలో సుధీర్‌ బాబు హీరోగా నటించిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ఇషా రెబ్బా, మృణాలినీ రవి హీరోయిన్లు.

సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మించిన ఈ సినిమా అక్టోబర్‌ 6న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో మహేశ్‌ బాబు షేర్‌ చేశారు. ‘‘మనం’ రచయితగా మీ అందరి ప్రేమాభిమానాలు పొందాను. ఇంతకాలం విరామం తీసుకొని ‘మామా మశ్చీంద్ర’ చేయడానికి కారణం.. ప్రేక్షకుల నమ్మకాన్ని వమ్ము చేయకూడదని’’ అన్నారు హర్షవర్ధన్‌. ‘‘ఈ చిత్రంలో ప్రతి పదిహేను నిమిషాలకు ఒక మలుపు, సర్ర్‌పైజ్‌ వస్తుంది’’ అన్నారు పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement