Malaika Arora Marriage: 49 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అయిన మలైకా అరోరా?

Malaika Arora Said Yes Is She Getting Married To Arjun Kapoor - Sakshi

బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌, మలైకా అరోరా ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని వారు ఎప్పుడూ దాచలేదు. వెకేషన్స్‌, పార్టీ, ఫంక్షన్స్‌ ఇలా ప్రతీ వేడుకకు కలిసే హాజరవుతుంటారు. బీటౌన్‌లో మలైకా-అర్జున్‌ల జోడికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక సినిమాల కంటే డేటింగ్‌ వార్తలతో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిన ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్నారట.

ఈ మేరకు మలైకా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్‌ చేస్తూ.. అవును నేను, అంగీకరించాను అంటూ లవ్‌ ఎమోజీని షేర్‌ చేసింది. దీంతో అర్జున్‌-మలైకాలు ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి డిసైడ్‌ అయ్యారంటూ బీటౌన్‌ మీడియా కోడై కూస్తుంది. మరి నిజంగానే వీళ్లు పెళ్లిపీటలు ఎక్కనున్నారా? లేదా ఏదైనా మూవీ ప్రమోషన్స్‌ కోసం చేసిన స్టంటా? అన్నది త్వరలోనే తేలనుంది.

కాగా మలైకా ఆరోరాకు ఇదివరకే అర్భాజ్‌ ఖాన్‌తో పెళ్లయింది. 17ఏళ్ల వివాహ బంధం తర్వాత వీరు విడిపోయారు. ప్రస్తుతం మలైకా తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన అర్జున్‌ కపూర్‌తో ప్రేమలో ఉంది. 

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top