
సమయం దొరికితే ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడతానని అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. సినిమా కంప్లీట్ అయితే చాలు భార్యపిల్లలతో కలిసి విదేశాలకు చెక్కేస్తాడు.
Mahesh Babu Shares Selfie With Family In Italy Photo Viral: సమయం దొరికితే ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడతానని అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. సినిమా కంప్లీట్ అయితే చాలు భార్యపిల్లలతో కలిసి విదేశాలకు చెక్కేస్తాడు. ఇటీవల మహేశ్ బాబు హీరోగా నటించిన 'సర్కారు వారి పాట' ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదే కాకుండా తాను నిర్మాతగా వ్యవహరించిన 'మేజర్' మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న మహేశ్ బాబు ఫ్యామిలీతో కలిసి టూర్‌కు వెళ్లారు.
ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. నమ్రతా శిరోద్కర్, గౌతమ్, సితారతో కలిసి దిగిన ఫొటోటను షేర్ చేశాడు మహేశ్ బాబు. ఈ పోస్ట్‌కు 'ఇది రోడ్ ట్రిప్. నెక్ట్స్ స్టాప్ ఇటలీ. లంచ్ విత్ ది క్రేజీస్' అంటూ మహేశ్ బాబు రాసుకొచ్చాడు. ఈ ఫొటోలో లైట్ బియర్డ్‌తో చాలా హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు మహేశ్ బాబు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో మహేశ్ లుక్ నెటిజన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
చదవండి: సినిమా టికెట్ల కోసం క్యూలో మహేశ్ బాబు.. వీడియో వైరల్
సితార సోఫాలో నుంచి కిందపడిపోయింది: మహేశ్ బాబు