
సినిమాలకంటే వివాదాలతో పాపులర్ అయిపోయింది తమిళ హీరోయిన్ మీరా మిథున్. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ గతంలో వైరల్ అయ్యేది.. అయితే, ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని చెన్నై న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు మూడేళ్ల క్రితం దళితుల గురించి ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆ సమయంలో పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ వివాదంలో ఆమెతో పాటు ఆమె స్నేహితుడు శ్యామ్ అభిషేక్‌పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి 2022లోనే అరెస్టు చేశారు. అయితే, బెయిల్పై వారిద్దరూ బయటకు వచ్చేశారు. కేసు విచారణకు వారు సహకరించకపోవడంతో అరెస్ట్ వారెంట్ ఆ సమయంలోనే జారీ అయింది. ఇప్పటికే మూడేళ్లు అవుతున్నా ఆమె పరారీలోనే ఉండటంతో పోలీసులు గుర్తించలేకపోయారు.
ఢిల్లీ వీధుల్లో మీరా మిథున్
ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్న తన కూతురు మీరా మిథున్ను కాపాడాలని ఆమె తల్లి ఒక పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఆమె గురించి తెలిసింది. మీరా తల్లి పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం మీరాను రక్షించాలని పోలీసులను సూచించింది. దీంతో ఢిల్లీ పోలీసులు ఆమెను గుర్తించి అక్కడున్న హోంకి తరలించారు. అయితే, ఆమెను ఈనెల 11న చెన్నై న్యాయస్థానంలో హజరుపరచాలని కోర్టు తెలిపింది. మీరా మిథున్ అనునిత్యం వివాదాలతోనే ఉంటుంది. ఆమె బిగ్బాస్లో ఉన్నప్పుడు ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లారు. విశాల్, త్రిష, రజనీకాంత్, విజయ్ వంటి స్టార్స్పై అనుచిత వ్యాఖ్యలు కూడా చేసింది.