
అనీష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ ఓటీపీ’. ‘ఓవర్... టార్చర్... ప్రెజర్’ అనేది ఉపశీర్షిక. జాన్విక, స్వరూపిణి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించగా, రాజీవ్ కనకాల కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్.
‘ఇద్దరు అమ్మాయిల్ని లవ్ చేశానండి...’, ‘అంటే... ఒకరికి తెలియకుండా మరొకరిని...’, ‘అరె... మామ బ్రేకప్ అనగానే ఊపిరాడట్లేదురా నాకు’ అనే డైలాగ్స్ ఈ ట్రైలర్‌లో ఉన్నాయి. ‘‘ఈ చిత్రంలో తండ్రీకొడుకుల ఎమోషన్ కొత్తగా ఉంటుంది. మా ‘లవ్ ఓటీపీ’ సినిమాతో ఎవరూ ఊహించని ఎంటర్‌టైన్‌మెంట్‌ని మీ ముందుకు తీసుకువస్తున్నాం’’ అని చెప్పారు నిర్మాత విజయ్ .యం రెడ్డి.