హీరోగా రీఎంట్రీ ఇస్తున్న 'కిక్' సినిమా విలన్ | Kick Shaam Re Entry With Asthram Movie In Lead Role | Sakshi
Sakshi News home page

హీరోగా రీఎంట్రీ ఇస్తున్న 'కిక్' సినిమా విలన్

Feb 5 2024 12:23 PM | Updated on Feb 5 2024 12:34 PM

Kick Shaam Re Entry With Asthram Movie - Sakshi

ప్రముఖ నటుడు శామ్‌.. చిన్న గ్యాప్‌ తర్వాత హీరోగా మళ్లీ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు 'అస్త్రం' అనే టైటిల్ నిర్ణయించారు. బెస్ట్‌ మూవీస్‌ పతాకంపై ధన షణ్ముగ మణి నిర్మిస్తుండగా.. నటుడు అరవింద్‌ రాజగోపాల్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రముఖ మోడల్‌ నిరంజని ఈ చిత్రంతోనే హీరోయిన్‌గా పరిచయమవుతోంది. 

(ఇదీ చదవండి: 'హనుమాన్' కోసం 70-75 సినిమాలు రిజెక్ట్ చేశా: హీరో తేజ)

తాజాగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సుందర మూర్తి సంగీతమందిస్తున్నారు. ఇది క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ స్టోరీతో ఉంటుందని దర్శకుడు చెప్పుకొచ్చాడు. కరోనా కాలంలో 30 నిమిషాల నిడివితో కథ అనుకున్నాను కానీ తర్వాత అది సినిమా స్టోరీగా మార్చినట్లు తెలిపాడు. సోషల్‌ మీడియా ద్వారా శామ్‌కు కథ చెప్పగా, ఆఫీస్‌కి పిలిపించుకుని ఓకే చెప్పి సినిమా చేయడానికి రెడీ అయినట్లు చెప్పాడు. ఇందులో శామ్ పోలీసు అధికారిగా నటిస్తున్నారు. కాగా చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని 40 మంది సినీ ప్రముఖులు ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేయడం విశేషం. 

(ఇదీ చదవండి: క్యాన్సర్‪‌ని జయించిన భార్య.. స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ పోస్ట్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement