క్యాన్సర్‪‌ని జయించిన భార్య.. స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ | Sakshi
Sakshi News home page

Ayushmann Khurana: భార్య గురించి ఆ విషయాన్ని బయటపెట్టిన యంగ్ హీరో

Published Sun, Feb 4 2024 3:47 PM

Ayushmann Khurrana About Wife Tahira On World Cancer Day - Sakshi

ఏ మూవీ ఇండస్ట్రీ తీసుకున్నా స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా అదరగొట్టేస్తుంటారు. అలా హిందీలో బడా స్టార్స్‌తో పాటు ఆయుష్మాన్ ఖురానా లాంటి యువ కథానాయకులు కూడా హిట్స్ కొట్టేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇతడు పలు సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరైపోయాడు. ఇప్పుడు ఈ హీరో.. క్యాన్సర్‌ని జయించిన తన భార్యపై ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు.

(ఇదీ చదవండి: క్లీంకారకు కేర్‌ టేకర్‌గా సావిత్రి.. ఆమె జీతం ఎంతో తెలిస్తే..)

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి డిఫరెంట్ సినిమాలతో వరస హిట్లు కొడుతున్న ఆయుష్మాన్.. తహిరా కశ్యప్ అనే అమ్మాయిని కాలేజీ చదువుతున్నప్పుడే ప్రేమించాడు. 2008లోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. అంతా బాగానే ఉందనుకునే టైంలో 2018లో ఆయుష్మాన్ భార్యకి రొమ్ము క్యాన్సర్ ఉన్న విషయం బయటపడింది.

సరైన చికిత్స తీసుకోవడంతో ప్రస్తుతం ఆయుష్మాన్ భార్య తహిరా కశ్యప్ పూర్తిగా క్యాన్సర్ నుంచి కోలుకుంది. ఇది జరిగి చాలా కాలమైపోయింది. అయితే ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తన భార్య గురించి ఆయుష్మాన్ చెప్పుకొచ్చాడు. 'నీ గుండె ధైర్యాన్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటా' అని ఆమె క్యాన్సర్ ఎదురించీ గెలిచిన విషయాన్ని మరోసారి గుర్తుచేసుకున్నాడు. అలానే ఈమెకు సర్జరీ జరిగిన తర్వాత తీసిన ఓ ఫొటోని కూడా ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.

(ఇదీ చదవండి: 14 ఏళ్ల వయసు.. ఆరోజు జరిగింది ఇప్పటికీ మర్చిపోలేను: హీరోయిన్‌)

Advertisement
 
Advertisement