అల.. హిందీలో

Kartik Aaryan to star in Ala Vaikunthapurramuloo hindi remake - Sakshi

ఈ ఏడాది సంక్రాంతికి మంచి హిట్‌ అందుకొని, అల్లు అర్జున్‌కి కమ్‌బ్యాక్‌ హిట్‌గా నిలిచిన ‘అల వైకుంఠపురములో..’ సినిమా హిందీలో రీమేక్‌ కాబోతున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్, యస్‌. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. హిందీ రీమేక్‌లో అల్లు అర్జున్‌ పాత్రను కార్తీక్‌ ఆర్యన్‌  చేయబోతున్నారు. ‘దేశీ బాయ్స్, డిష్యూం’ చిత్రాలను తెరకెక్కించిన రోహిత్‌ ధావన్‌ ఈ సినిమాను డైరెక్ట్‌ చేయనున్నారు. ఏక్తా కపూర్‌తో కలసి అల్లు అరవింద్‌ ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top