నిఖిల్‌ 'కార్తికేయ 3'కు ఆ నిర్మాతతో చిక్కులు రానున్నాయా..? | Karthikeya 3 Movie Rights Controversy | Sakshi
Sakshi News home page

Karthikeya 3 Movie: నిఖిల్‌ 'కార్తికేయ 3'కు ఆ నిర్మాతతో చిక్కులు రానున్నాయా..?

Aug 15 2023 8:15 AM | Updated on Aug 15 2023 10:32 AM

Karthikeya 3 Movie Rights Controversy - Sakshi

చందూ మొండేటి దర్శకత్వంలో హీరో నిఖిల్‌ నటించిన చిత్రం 'కార్తికేయ2' విడుదలై ఏడాది పూర్తి అయింది. అందుకు గుర్తుగా చిత్ర యూనిట్‌ తాజాగ పార్టీని ఏర్పాటు చేసింది. ఆందులో  డైరెక్టర్ చందూ మొండేటితో పాటు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా పాల్గొన్నారు. ఈ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్స్‌ రాబట్టడంతో పార్ట్‌ 3 కూడా ఉండబోతుందనే వార్తలు వచ్చాయి. ఇదే విషయంపై అఫిషీయల్‌గా కార్తికేయ3 కథ రెడీ చేశామని త్వరలో సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని డైరెక్టర్‌ చందూ మొండేటి ప్రకటించారు.

(ఇదీ చదవండి: 'భోళా శంకర్'పై చిరంజీవి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌)

ఈ ప్రకటనే వారికి ఇబ్బందులు తెచ్చాయని తెలుస్తోంది. 2014లో కార్తికేయ సినిమా విడుదలై అప్పుడు సూపర్‌ హిట్‌ అయింది. కానీ అప్పట్లో రిలీజ్‌ సమయంలో చిత్ర యూనిట్‌కు ఫైనాన్స్‌ ఇబ్బందులు వచ్చాయట. ఆ సమయంలో వారికి 'భమ్ భోలేనాథ్' సినిమా నిర్మించిన  సిరువూరి రాజేష్ వర్మ అనే నిర్మాత ఫైనాన్స్ చేసి రిలీజ్‌కు సాయం చేశారట. ఆప్పుడు ఆయన కార్తికేయ ఫ్రాంచైజ్ హక్కులు అగ్రీమెంట్స్ ద్వారా తీసుకున్నారట.

(ఇదీ చదవండి: అందులో అర్ధ నగ్నంగానే నటించాను తప్పేంటి: టాప్‌ హీరోయిన్‌)

కానీ కార్తికేయ 2 విడుదల సమయంలో  నిఖిల్‌తో ఆయనకున్న రేలేషన్‌తో ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా NOC ఇచ్చారట. అందుకు గాను ఆ సినిమాలో రాజేష్‌కు థాంక్స్ కార్డు కూడా వేశారు. తాజాగ కార్తికేయ 3 విషయంలో తనకు మాట మాత్రం చెప్పకుండా ప్రకటన చెయ్యడమే కాకుండా ఇంకో ప్రొడ్యూసర్‌తో మూవీ చెయ్యడానికి రెడీ అయిపోవడంతో రాజేష్ అభ్యంతరం తెలుపుతున్నాడట. తన ప్రమేయం లేకుండా ఈ ప్రాజెక్ట్‌పై ఎవరైనా ముందుకు వెళ్తే అన్ని  లీగల్ నోటీసులు జారీ చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement