karthika Deepam: కార్తీక్‌ వింత ప్రవర్తన, ఆశ్చర్యంలో దీప

Karthika Deepam Today Episode: Deepa Fires On Monita - Sakshi

కార్తీకదీపం మే 12: దీప తండ్రి మురళీ కృష్ణ కార్తీక్‌ నా కూతురికి పిల్లలకు తల్లి అవసరం ఉంటుందని తెలిసి కూడా వెళ్లిందంటే అర్థమేంటని నిలదిస్తాడు. నా కూతురి ఒక బొమ్మల చూశారని, దానిలో ఆశలు రేపి మనసుతో ఆడుకున్నారంటాడు. నేను భర్తగా నిన్ను ఇంటికి తీసుకేళ్లున్నానని నీ కూతురితో చెప్పలేదుకదా అని కార్తీక్ అనగా.. మరి మా మ్మ-నాన్నలకు కోడలిగా తీసుకేళ్తున్న అని మీరు కూడా చెప్పలేదు కదా అంటాడు మొరళీ కృష్ణ. ఇంతలో అక్కడికి మోనిత వస్తుంది. ఆమెను చూడాగానే.. ఆహా పాపి చిరాయివని ఊరికే అన్నారా తలుచుకున్న లేకపోయిన తగలబుడుతుందంటూ కౌంటర్‌ వేస్తాడు మురళీ కృష్ణ.

దీప దొరికిందా కార్తీక్‌ అని మోనిత అడగ్గానే.. ఏమ్మా దీప అత్తాగారింటి నుంచి వెళ్లిపోయిందని నీకు తెలుసా అనగా కార్తీక్‌ చెప్పాడని చెబుతుంది. దీంతో ఓహో.. నా కూతురు వెళ్లిపోతే నాతో చెప్పకుండ నీకు ఫోన్‌ చేసి చెప్పాడా అంటూ వ్యంగ్యంగా అంటాడు మురళీ కృష్ణ. దీంతో మోనితా మరీ మీ కూతురు నేను వెళ్లిపోతున్నానని మీతో అయినా చెప్పొచ్చు కదా అంటుంది. చెప్పదమ్మా నా కూతురికి ఆత్మాభిమానం ఎక్కువ.. విలువ లేని చోటుకి అస్సలు వెళ్లదు నీ..లా అంటూ సమాధానం ఇస్తాడు. మరీ నీ కూతురు కట్టుకున్న భర్తకు కూడా చెప్పకుండా వెళ్లిపోవడం కరెక్టా అని మోనితా ప్రశ్నించగా.. అది తప్పే మొగుడితో చెప్పకుండా వెళ్లడం, అది భార్యభర్తల సమస్య.. మరీ నువ్వేందుకు ఆ కుటుంబ సమస్యల్లో తలదూరుస్తున్నావు మాటిమాటి అని మోనితను అవమానించేలా మాట్లాడుతుంటాడు అయన.

దీంతో కార్తీక్‌.. ఏం మాట్లాడుతున్నారు కూతురు కనిపించడంలేదనే ఆవేశంలో మాట్లాడుతన్నారనుకున్న కొంచం మర్యాదగా మాట్లాడండి అంటాడు. అలాగే హాయిగా విశ్రాంతి తీసుకుంటూ మందులు వేసుకొమ్మని చెప్పడం కూడా తప్పేనా అంటుండగా... దానికి మొరళీ కృష్ణ.. చెప్పడం తప్పు కాదు చెప్పే పద్దతి తప్పు.. అంటు శ్రీరామ నవమి రోజు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తాడు. ఆ రోజు మీ స్నేహితురాలు మోనిత కాకుండా మీరు కానీ, మీ అమ్మతో కానీ టాబ్లెట్‌ ఇప్పిస్తే మారు మాట్లాడకుండా వేసుకునేది నా కూతురు అంటాడు. ఆ టబ్లెట్‌ మోనిత ఇస్తే ఏమైంది అని కార్తీక్‌ అడగ్గా.. తన చేతితో వేస్తే అమృతం కూడా విషయం అవుతుందంటాడు. అందుకే నా  కూతురు కళ్లు తిరిగి పడిపోయింది అంటాడు ఆయన. ఇక వెంటనే మోనిత మాట్లాడుతూ.. మీ కుటుంబ విషయాల్లో కలుగజేసుకోవద్దని చెప్పిన మీకు నా గురించి అవమానం మాట్లాడే ఆర్హత కూడా లేదు. 

నేను ఒక డాక్టర్‌ని అన్న విషయం మర్చిపోకండి అంటుంది. అయితే దీప మీ ఇంటిక రాలేదా అని కార్తీక్‌ అడగ్గా.. రాలేదు, రాదు కూడా అది మనసు విరిగి వెళ్లింది, ఆ విజయనగరంలోనే దాని పని అది చేసుకుంటు ఉండేది అక్కనుంచి దాన్ని తీసుకు వచ్చి గుండెలో చిచ్చురేపారని మురళీ కృష్ణ అసహనం వ్యక్తం చేస్తాడు. దీనికి కార్తీక్‌ అవును బాగానే ఉండేంది, టిఫీన్లకు పప్పులు రుబ్బుతూ, బాగానే ఉండేది, మరీ ఆరోగ్యం పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తాడు. మధ్యలో మోనిత ఈ పెద్దాయనతో ఇక్కడ ఎందుకు మాటలు దీప ఎక్కడికి వెళ్లిందో వెతుకుదాం పదా అంటుంది. మరోవైపు దీప పోయ్యి దగ్గర పిండి వంటలు చేస్తూ ఉంటుంది. సరోజక్కతో ఈ దీప మళ్లీ వంటలక్కగా మారింది అంటూ నవ్వుకుంటుంది. ఇంతలో కార్తీక్‌, మోనితలు అక్కడి వస్తారు.  సరోజక్క చూసి దీప డాక్టర్‌ బాబు వచ్చాడు అని సైగా చేస్తుంది.

ఏదో ఆర్డర్‌ ఇచ్చిపోడానికి వచ్చినట్లున్నారని, ఏం కావాలో కనుక్కొని అడ్వాన్స్‌ తీసుకుని పంపించు అనగానే.. మోనిత దీపా... అంటూ పలకరిస్తుంది. ఒకేసారి అగ్రహంతో ఊగిపోయిన దీప పొయ్యిలోని మండే కట్టెతీసుకుని మోనితను ఇక్కడ నుంచి నడవవే.. ఇదంతా నీ వల్లే కదా నేను చస్తే  నా మొగుడ్ని కట్టుకుందామని గుంట కాడి నక్కల ఎదురు చూస్తూ నాకు టాబ్లెట్‌ మార్చి ఇచ్చి కళ్లు తిరిగిపడిపోయేలా చేశావ్‌ అనగానే, మోనిత హడలెత్తిపోతుంది. విన్నావు కదా కార్తీక్‌ నేను వెళుతున్నా అంటూ మెల్లిగా జారుకుంటుంది మోనితా. ఆ తర్వాత దీప డాక్టర్‌ బాబుతో మీతో వచ్చింది వెళ్లింది కదా ఇంకేందుకు ఇక్కడున్నారు వెళ్లండి అనగానే.. పొయ్యిలో నీళ్లు పోసి దీపను లోపలికి పదా అంటూ లాక్కెళ్లి విచిత్రంగా ప్రవర్తిస్తాడు కార్తీక్‌. అది చూసి దీప ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది, దీపకు కార్తీ నిజం చెప్తాడా లేదా అనేది రేపటి ఎపిసొడ్‌లో తెలుసుకుందాం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top