RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ మేనియా.. కర్ణాటక టికెట్‌ రేట్స్‌పై ఆశ్యర్యం

Karnataka Allows Higher Ticket Prices For RRR Movie - Sakshi

రాజమౌళి దర్శకత్వంలో నిర్మించిన బహుభాషా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం శుక్రవారం రాష్ట్రంలో విడుదలైంది. ఈ సందర్భంగా థియేటర్ల వద్ద రామ్‌చరణ్, జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు  బాణసంచా పేల్చి సందడి చేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు  రూ. 250 నుంచి రూ. 800 వరకు టిక్కెట్‌ ధర వసూలు చేశారు. కన్నడ సినిమాలకు ఇంత ఎక్కువ టికెట్‌ ధరలు ఏ చిత్రానికి కూడా ఉండవు. ఈ విషయంపై సోషల్‌ మీడియాలో ట్రోల్‌ జరుగుతోంది. ప్రతిసారి మల్టిప్లెక్స్‌ల్లో ఈ విధమైన భారీ టికెట్‌ ధరలు కనిపిస్తాయి.  

తాజాగా ఈ విధానం సింగిల్‌ థియేటర్లలో కూడా ఎంట్రీ అయింది.  టికెట్‌ ధర రూ. 200కు మించి ఉండకూడదని కొన్నేళ్ల క్రితం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా ఆ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఇలా వందలాది రూపాయలను ఖర్చు పెట్టి చూడడం సామాన్యుడికి భారంగా మారింది. సాధారణ రోజుల్లో కంటే ఈ సినిమా టికెట్‌ ధరలు ఎక్కువగా ఉన్నాయని  చాలా మంది పెదవి విరుస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top