శిల్పాశెట్టికి గడ్డుకాలం..'హంగామా' రిలీజ్‌కు బ్రేక్‌?

Is Karisma Kapoor Replacing Shilpa Shetty As A judge in Super Dancer  - Sakshi

జడ్జిగా శిల్పా శెట్టి స్థానంలో కరీష్మా కపూర్‌?

Raj Kundra Arrest: పోర్నోగ్రఫీ కేసులో కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా అరెస్ట్‌ కావడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వెబ్‌ సిరీస్‌ అవకాశాల పేరుతో యువతులకు గాలం వేసి.. వాళ్లతో అడల్ట్‌ చిత్రాలు తీస్తున్నాడని రాజ్‌కుంద్రాపై ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. కుంద్రా అరెస్ట్‌తో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గత రెండు రోజులుగా దీనికి సంబంధించిన వార్తలు హెడ్‌లైన్స్‌గా మారాయి. ఈ మొత్తం వ్యవహారంతో ఆయన భార్య, ప్రముఖ నటి శిల్పా శెట్టి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది. దీంతో ఆమె జడ్జిగా ఉన్న ఓ రియాలిటీ షో నుంచి తప్పుకోవాలని శిల్పా భావిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 


తాజాగా ఈ షోకు సంబంధించిన లేటెస్ట్‌ ప్రోమోను సోనీ టీవీ రిలీజ్‌ చేసింది. ఇందులో శిల్పా శెట్టి స్థానంలో కరీష్మా కపూర్‌ కనిపించడం రూమర్స్‌కు మరింత బలం చేకూర్చాయి. అయితే కరీష్మా కేవలం ఒక్క ఎపిసోడ్‌కు మాత్రమే గెస్ట్‌గా వచ్చారని, ఆమె షో మొత్తానికి కొనసాగరని సన్నిహిత వర్గాల సమాచారం. దీంతో శిల్పా శెట్టి స్థానంలో మరొకరు వస్తారా? లేక ఆమె తిరిగి జడ్జిగా కొనసాగుతారా అన్నది చూడాల్సి ఉంది. కొద్ది నెలల క్రితం రాజ్‌కుంద్రా సహా మిగతా కుటుంబసభ్యులు కోవిడ్‌ బారిన పడిన విషయం తెలిసిందే.


ఆ సమయంలో శిల్పా బ్రేక్‌ తీసుకోగా, ఆమె స్థానంలో మలైకా అరోరా జడ్జిగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె మరో రియాలిటీ షోకు జడ్జిగా కొనసాగుతున్నారు. మరోవైపు శిల్పా శెట్టి ప్రధానపాత్రలో నటించిన 'హంగామా' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.  పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన శిల్పా.. ఈ చిత్రంతో మంచి కమ్‌ బ్యాక్‌ ఇవ్వాలని భావించింది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో రాజ్‌కుంద్రా అరెస్ట్‌తో శిల్పాకు గడ్డుకాలమనే చెప్పొచ్చంటున్నారు సినీ పెద్దలు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top