Comedian Kapil Sharma Turn Into Food Delivery Boy Photo Goes Viral - Sakshi
Sakshi News home page

Kapil Sharma Pic Viral: ఫుడ్‌ డెలివరి బాయ్‌ అవతారం ఎత్తిన ప్రముఖ హాస్య నటుడు

Mar 19 2022 10:27 AM | Updated on Mar 19 2022 11:54 AM

Kapil Sharma Turn Into Food Delivery Boy Photo Goes Viral - Sakshi

సోషల్‌ మీడియాలో సెలబ్రెటీ షాకింగ్‌ ఫొటో దర్శనం ఇచ్చింది. అది చూసి అంతా షాక్‌ అవుతున్నారు. ప్రముఖ హాస్య నటుడు డెలివరి బాయ్‌గా అవతారం ఎత్తి ఒడిసా రోడ్లపై కనిపించాడు. ఇక ఆయనను లైవ్‌గా చూసిన వారంత నమ్మలేక ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంతకి ఆ నటుడు ఎవరంటే బాలీవుడ్‌ పాపులర్‌ కమెడియన్‌ కపిల్‌ శర్మ. ఆయన ఫుడ్‌ డెలివరి చేస్తూ ఒడిసా రోడ్లపై కనిపించాడు.

చదవండి: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ మూవీపై ప్రకాశ్‌ రాజ్‌ షాకింగ్‌ కామెంట్స్‌, ట్వీట్‌ వైరల్‌

ఆయనను దగ్గరగా చూసినవారు తమ కెమెరాల్లో బందించి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్‌ చేస్తున్నారు. దీంతో ఆయన ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా ప్రస్తుతం కపిల్‌ శర్మ నటి, దర్శకురాలు నందిత దాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో ఆయన ఫుడ్‌ డెలివరి బాయ్‌ పాత్రలో కనిపించానున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఈ మూవీ ఒడిసాలో షూటింగ్‌ను జరుపుకుంది. అక్కడ ఎల్లో కలర్‌ టీ-షర్ట్‌, డెలివరి బ్యాగ్‌, బ్లాక్‌ హెల్మెట్‌తో ద్విచక్ర వాహనంపై వెళుతూ కనిపించాడు. ఇక ఆయనను అలా చూసిన ఓ వ్యక్తి ఫొటో తీసి ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

చదవండి: ‘రాధేశ్యామ్‌’పై వర్మ షాకింగ్‌ కామెంట్స్‌, మూవీకి అంత అవసరం లేదు..

దీనికి ‘సర్‌ మిమ్మల్ని నేను లైవ్‌లో చూశాను’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు. ఈ ట్వీట్‌పై కపిల్‌ స్పందిస్తూ.. ‘ఎవరికి చెప్పకు’ అంటూ రీట్వీట్‌ చేశాడు. దీంతో ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా బీటౌన్​లో మోస్ట్ పాపులర్​ కమెడియన్​లో కపిల్ శర్మ ఒకరు. ఆయన పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కామెడీ నైట్స్​ విత్​ కపిల్ శర్మ షోతో స్టార్​ కమెడియన్​గా మారాడు. బాలీవుడ్​లో ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్​ అయినా కపిల్​ షోకి వచ్చి ప్రమోట్​ చేసుకోవాల్సిందే అన్నంత రేంజ్​లో కపిల్​ విజయం సాధించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement