Jr.NTR Latest New Look Pics Goes Viral on Social Media - Sakshi
Sakshi News home page

Jr Ntr : వైరల్‌గా మారిన ఎన్టీఆర్‌ లేటెస్ట్‌ లుక్‌..

Apr 14 2022 4:18 PM | Updated on Apr 14 2022 5:29 PM

Jr Ntr Latest And Fresh Look Goes Viral In Social Media - Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో తారక్‌ పాన్‌ ఇండియా స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. కొమరం భీమ్‌ పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత కొరటాల శివతో తారక్‌ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. కొమరం భీమ్‌ కోసం రఫ్‌ లుక్‌లో కనిపించిన ఎన్టీఆర్‌ ఈ చిత్రం కోసం కంప్లీట్‌ లుక్‌ని మార్చేశాడు. స్లిమ్‌గా, స్టైలిష్‌ లుక్‌లోకి మారిపోయాడు. స్పోర్ట్స్ డ్రామా కాబట్టి ఫిట్ గా ఉండాలని కొరటాల సూచించడంతో అందుకు తగ్గట్లు తారక్‌ మారిపోయాడు. మాంచి ట్రిమ్డ్‌ లుక్‌లోకి వచ్చి సరికొత్త స్టైల్‌లో కనిపిస్తున్నాడు.

దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన దీపికా పదుకొనె నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement