'జైలర్' మరో హీరో అనిరుధ్‌కి కొత్త కారు గిఫ్ట్ | Jailer Producer Gifts Porsche Car And Cheque To Anirudh - Sakshi
Sakshi News home page

Jailer Anirudh: వాళ్లిద్దరితో పాటు అనిరుధ్‌కి కూడా గిఫ్ట్స్

Published Mon, Sep 4 2023 9:27 PM

Jailer Producer Gifted Porsche Car And Cheque To Anirudh - Sakshi

'జైలర్'లో హీరో సూపర్‌స్టార్ రజనీకాంత్. అదే మరో హీరో ఎవరు అంటే దాదాపు ప్రతిఒక్కరూ చెప్పే పేరు అనిరుధ్. ఈ మూవీని పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో మరో రేంజుకి తీసుకెళ్లాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు అతడి పనికి అద్భుతమైన ప్రతిఫలం దక్కింది. నిర్మాత కళానిధి మారన్.. అదిరిపోయే బహుమతులు ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు.

(ఇదీ చదవండి: మెగా ఫ్యామిలీ ఫారెన్ టూర్.. కారణం అదేనా?)

చాలా రోజుల నుంచి సరైన హిట్ లేక అల్లాడిపోయిన రజనీకాంత్‌కు 'జైలర్' రూపంలో బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కింది. ఈ సినిమా స్టోరీ పరంగా కొత్తగా లేనప్పటికీ.. రజనీ స్టైల్, స్వాగ్ తోపాటు అనిరుధ్ మ్యూజిక్ బాగా ఎక్కేసింది. దీంతో మూవీ సూపర్ హిట్ అయిపోయింది. ప్రస్తుతం రూ.700 కోట్ల మేర వసూళ్లు దక్కినట్లు తెలుస్తోంది. 

మూవీ ఈ రేంజులో హిట్ కావడంతో పాటు ఈ స్థాయిలో లాభాలొచ్చేసరికి నిర్మాత కళానిధి మారన్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కొన్నిరోజుల ముందు హీరో రజనీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌కి ఖరీదైన కార్లతోపాటు చెక్ ని బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు అనిరుధ్ కి కూడా ఓ చెక్ ప్లస్ కాస్ట్ లీ పోర్స్ కారుని బహుమతిగా ఇచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబరు 7 నుంచి 'జైలర్' స్ట్రీమింగ్ కానుంది. 

(ఇదీ చదవండి: 'బిగ్ బాస్' భయపడ్డాడా? ఏకంగా ఆ విషయంలో!)

Advertisement
 
Advertisement
 
Advertisement