Rithu Chowdary: నన్ను వదిలి ఎలా వెళ్లిపోయావ్ నాన్న? రీతూ తీవ్ర భావోద్వోగం

Jabardasth Actress Rithu Chowdary Emotional Post About Her father Passes Away - Sakshi

పాపులర్ కామెడీ షో జబర్దస్త్‌ నటి రీతూ చౌదరి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, జబర్దస్త్ కమెడియన్లు విచారం వ్యక్తం చేశారు. తండ్రి చనిపోవడంతో తీవ్ర ఎమోషనల్‌కు గురైంది రీతూ చౌదరి. తన తండ్రిని తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసిందామె. తండ్రితో దిగిన ఫోటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేస్తూ భావోద్వేగమైన నోట్ రాసింది. 

(ఇది చదవండి: తీవ్ర విషాదం.. టాలీవుడ్ యువ నటుడు ఆత్మహత్య)

తండ్రితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ..  “నాన్న నిన్ను చాలా మిస్ అవుతున్నా. నీతో దిగిన ఫొటోను ఇలా పోస్ట్ చేయాల్సి వస్తుందని ఊహించలేదు.  నీతో దిగిన లాస్ట్ ఫొటో ఇదే నాన్న. నన్ను ఎలా వదిలి వెళ్లిపోయావు? నువ్వు లేకుండా నేను ఉండలేను. డాడీ ప్లీజ్ తిరిగిరా నీ కూతురు దగ్గరికి.' తీవ్రమైన భావోద్వేగ పోస్ట్ చేసింది రీతు చౌదరి.  ఆమెకు ఇంట్లో అందరి కంటే తండ్రి అంటేనే చాలా ఇష్టం.  ఇప్పుడు ఆయన లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతోంది జబర్దస్త్ నటి రీతూ.
 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top