Madras High Court Comments On Shankar Indian 2 Movie | విచారణను ఏప్రిల్‌ 28కి వాయిదా వేసింది - Sakshi
Sakshi News home page

‘ఇండియన్‌ -2’ వివాదం: మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Apr 22 2021 5:30 PM | Updated on Apr 22 2021 9:20 PM

Indian 2 Movie: Madras High Court Asks Shankar And Lyca Productions To Settle The Issue - Sakshi

గత ఏడాది మార్చికే ‘ఇండియన్‌-2’ షూటింగ్‌ పూర్తి చేస్తామని శంకర్‌ హామీ ఇచ్చారని, ఆసల్యం చేయడంతో భారీగా నష్టపోయామని కోర్టుకు విన్నవించింది. ఇతర చిత్రాలు చేపట్టకుండా శంకర్‌పై ఆంక్షలు విధించాలని హైకోర్టును కోరింది.

‘ఇండియన్‌ -2’ వివాదంలో ఇరుపక్షాలు కూర్చొని మాట్లాడుకోవాలని దర్శకుడు శంకర్‌, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌కు మద్రాసు హైకోర్టు సూచించింది. కోర్డు జోక్యంతో వివాదంలో సానుకూలత ఏర్పడదని వ్యాఖ్యానించింది. లైకా ప్రొడక్షన్‌లో రూపొందితున్న ఇండియన్ 2 ప్రాజెక్టును మధ్యలోనే ఆపేసి మరో సినిమాను స్టార్ట్ చేస్తుండడంతో శంకర్‌పై నిర్మాణ సంస్థ కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై మద్రాసు హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా లైకా ప్రోడక్షన్స్‌ తమ వాదనలు వినిపిస్తూ.. గత ఏడాది మార్చికే ‘ఇండియన్‌-2’ షూటింగ్‌ పూర్తి చేస్తామని శంకర్‌ హామీ ఇచ్చారని, ఆసల్యం చేయడంతో భారీగా నష్టపోయామని కోర్టుకు విన్నవించింది. ఇతర చిత్రాలు చేపట్టకుండా శంకర్‌పై ఆంక్షలు విధించాలని హైకోర్టును కోరింది. నటుడు వివేక్‌ మృతి చెందడంతో ఈ సీన్లన్నీ మళ్లీ తీయాలని శంకర్‌ తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తమ జోక్యంలో సమస్యకు పరిష్కారం కాదని, ఇరు పక్షాలు కూర్చొని ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అనంతరం విచారణను ఏప్రిల్‌ 28కి వాయిదా వేసింది.

1996లో కమల్‌హాసన్‌  హీరోగా శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్‌ ’కు సీక్వెల్‌గా ‘ఇండియన్‌  2’ తెరకెక్కుతోంది. లైకా ప్రొడక్షన్స్‌ ఆ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరగడం, కమల్‌ హాసన్‌  మొన్నటివరకు రాజకీయంగా బిజీగా ఉండటంతో ఇప్పటికే 60 శాతం దాకా పూర్తయిన ‘ఇండియన్‌  2’కు బ్రేక్‌ పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement