బన్నీకి ప్రత్యేక కృతజ్ఞతలు: బేబీ నిర్మాత | Icon Star Allu Arjun Visit SKN Residence And Paid Tribute To His Father, Pic Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Allu Arjun: బన్నీ తన ఇంటికి రావడం ఓదార్పునిచ్చింది: బేబీ నిర్మాత

Published Tue, Jan 23 2024 2:47 PM

Icon Star Allu Arjun Condolences To Producer SKN Father Demise - Sakshi

టాలీవుడ్‌లో వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో కమర్షియల్ చిత్రాలు నిర్మిస్తూ మంచి పేరు తెచ్చుకున్న నిర్మాతల్లో ఎస్‌కేఎన్‌ ఒకరు. కాగా.. ఇటీవలే ఆయ‌న ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఆయన తండ్రిని కోల్పోయారు. ఇంకా ఆ బాధ నుంచి ఎస్‌కేఎన్‌ బయటికి రాలేదు. అతని కుటుంబం అంతా ఆయన ఇంటి పెద్దను కోల్పోయిన బాధలోనే  ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐకాన్‌ స్టార్‌ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.

తాజాగా ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని ఎస్‌కేఎన్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఎస్‌కేఎన్ తండ్రి గారి చిత్ర‌ప‌టానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దీంతో తాను అభిమానించే బన్నీ తన ఇంటికి రావడం చాలా ఓదార్పునిచ్చిందని అన్నారు. ఇలాంటి క‌ష్ట  సమయంలో నా ఇంటికి వచ్చి.. నాకు ధైర్యం చెప్పినందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. ఇండస్ట్రీలో మొదటి నుంచి అల్లు అర్జున్  ప్రతిభ, అంకితభావాన్ని అభిమానించే ఎస్‌కెఎన్‌కు బన్నీ అంటే చాలా గౌరవం. ఎస్‌కేఎన్ 'బేబీ', 'టాక్సీవాలా' లాంటి సూపర్ హిట్‌ చిత్రాలను నిర్మించారు. 

Advertisement
Advertisement