తెలంగాణలో నో పర్మిషన్‌.. ఏపీకి షిఫ్ట్‌ అయిన 'గుంటూరు కారం' ఈవెంట్‌ | Guntur Kaaram Pre Release Event Plan In AP | Sakshi
Sakshi News home page

తెలంగాణలో నో పర్మిషన్‌.. ఏపీకి షిఫ్ట్‌ అయిన 'గుంటూరు కారం' ఈవెంట్‌

Jan 8 2024 1:12 PM | Updated on Jan 8 2024 1:39 PM

Guntur Kaaram Pre Release Event Plan In AP - Sakshi

ఈ సంక్రాంతికి గుంటూరు కారం చిత్రంతో హిట్‌ పెంచేందుకు టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేశ్‌ బాబు బరిలోకి దిగుతున్నాడు.  త్రివిక్రమ్‌- మహేశ్‌ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జనవరి 12న విడుదలకు రెడీగా ఉన్న ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్‌ విడుదలైంది. మంచి రెస్పాన్స్‌తో యూట్యూబ్‌ను షేక్‌ చేస్తుంది. ట్రైలర్‌తో ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు కానీ ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు బ్రేక్‌ పడటంతో కాస్త నిరాశకు గురయ్యరనేది వాస్తవం

గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ వేడుక‌ను జనవరి 6న హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. అందుకు ఏర్పాట్లు కూడా యూసఫ్‌ గూడ పోలీస్‌ గ్రౌండ్‌లో రెడీ చేశారు. చివరి క్షణంలో భద్రతా సమస్యల కారణంగా తెలంగాణ ప్రభుత్వం ప‌ర్మిషన్‌ను ర‌ద్దు చేసింది. దీంతో మరో తేదీలో ఏర్పాట్లు చేసుకునేందుకు చిత్ర యూనిట్‌ ప్రయత్నాలు చేసింది. కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. దీంతో రేపు (జనవరి 9న) గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ వేడుక‌ గుంటూరులో జరగనుందని చిత్ర నిర్మాత నాగవంశీ అఫీషియల్‌గా ప్రకటించారు. 

గుంటూరులోని నంబూరు క్రాస్‌ రోడ్స్‌ వద్ద బహిరంగప్రదేశంలో  ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేసుకునేందుకు చిత్ర యూనిట్‌ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. అనుమతి లభించడంతో వారు అక్కడ ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు. అందుకు సంబంధించిన పోస్టర్స్‌, వీడియోలు కూడా నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. జనవరి 9న సాయింత్రం 5 గంటల నుంచి గుంటూరులో మహేశ్‌ ఫ్యాన్స్‌ జాతర గ్యారెంటీ. ఈ వేడుకలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి కూడా ఏపీకి భారీగా ఫ్యాన్స్‌ రానున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement