Bhimaa Teaser: వేటాడేందుకు బ్రహ్మ రాక్షసుడు వచ్చేశాడు | Sakshi
Sakshi News home page

Bhimaa Teaser: వేటాడేందుకు బ్రహ్మ రాక్షసుడు వచ్చేశాడు

Published Fri, Jan 5 2024 2:18 PM

Gopichand Bhimaa Teaser Released Now - Sakshi

టాలీవుడ్‌ మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ 'భీమా'గా బాక్సాఫీస్‌ బరిలోకి అడుగు పెట్టనున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కన్నడ దర్శకుడు ఎ.హర్ష తెరకెక్కిస్తున్నారు. కేకే రాధామోహన్‌ నిర్మాత. ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ కథానాయికలు.  ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

ఈ చిత్రంలో గోపీచంద్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించనున్నారు. టీజర్‌లో ఆయన లుక్‌ అదిరిపోయేలా ఉంది. గోపీచంద్‌ ఒక ఎద్దుపై కూర్చొని సంకెళ్లతో పాటు ఖాకీ దుస్తుల్లో కనిపించాడు. వినూత్నమైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా  గోపీ కెరియర్‌లో 31వ చిత్రంగా భీమా తెరకెక్కుతుంది.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కేజీఎఫ్‌ ఫేం రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఔట్ అండ్ ఔట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న భీమా సినిమాతో దర్శకుడు హర్ష టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.  ఫిబ్రవరి 16న భీమా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీనువైట్ల డైరెక్షన్‌లో తన 32 వ సినిమా కూడా చిత్రీకరణ దశలో ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement