'లియో' లోకేశ్ కనగరాజ్ కొత్త మూవీ టీజర్.. టైటిల్ తగ్గట్లు మొత్తం అవే! | Lokesh Kanagaraj's Debut Production Fight Club Movie Tamil Teaser Launch - Sakshi
Sakshi News home page

Fight Club Teaser: 'ఫైట్ క్లబ్' టీజర్.. ఇందులోనూ లోకేశ్ మార్క్!

Published Sat, Dec 2 2023 7:35 PM

Fight Club Movie Tamil Teaser Lokesh Kanagaraj - Sakshi

లోకేశ్ కనగరాజ్ పేరు చెప్పగానే మూవీ లవర్స్ అలెర్ట్ అయిపోతారు. ఎందుకంటే తీసింది ఐదు సినిమాలే గానీ కల్ట్ స్టేటస్ సంపాదించాడు. రీసెంట్‌గా 'లియో' సినిమాతో ఆకట్టుకున్నాడు. మొన్ననే ఈ చిత్రం రిలీజైంది. ఇప్పుడు మరో కొత్త మూవీతో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయిపోయాడు. తాజాగా టీజర్ రిలీజ్ అది.. అంచనాల్ని పెంచేస్తోంది.

ఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో ఎక్కడలేని గుర్తింపు తెచ్చుకున్న లోకేశ్ కనగరాజ్.. ఇప్పుడు నిర్మాతగా మారాడు. జీ-స్క్వాడ్ పేరుతో నిర్మాణ సంస్థ స్థాపించాడు. ఇందులో భాగంగా తన ఫ్రెండ్స్, సహాయకులని ఎంకరేజ్ చేసేందుకు ఈ సంస్థ స్థాపించినట్లు చెప్పుకొచ్చాడు. అలానే 'ఫైట్ క్లబ్' పేరుతో విజయ్ కుమార్ హీరోగా ఓ తమిళ సినిమా తీశారు.

(ఇదీ చదవండి: నయనతార 'అన్నపూరణి' సినిమా.. టాక్-రివ్యూ ఏంటంటే?)

డిసెంబరు 15న థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఈ చిత్ర టీజర్‌ని తాజాగా విడుదల చేశారు. 'ఫైట్ క్లబ్' అనే టైటిల్‪‌కి తగ్గట్లే టీజర్ అంతా యాక్షన్ సీన్స్ గట్టిగానే ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా హీరో విజయ్ కుమార్ పెద్దగా తెలియదు. ఉరయాడి, ఉరయాడి 2 సినిమాలతో నటుడిగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. సూర్య 'సూరరై పోట్రు' మూవీకి డైలాగ్స్ రాశాడు.

ఇప్పుడు లోకేశ్ కనగరాజ్ నిర్మించిన 'ఫైట్ క్లబ్' సినిమాతో దాదాపు నాలుగేళ్ల తర్వాత ప్రేక్షకుల్ని పలకరిస్తున్నాడు. టీజర్ చూస్తుంటే యాక్షన్ డ్రామా అనిపిస్తుంది. ఇందులో లోకేశ్ కనగరాజ్ మార్క్ అక్కడక్కడా కనిపిస్తుంది. మరి దర్శకుడిగా వరస హిట్స్ కొడుతున్న లోకేశ్.. నిర్మాతగా ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి?

(ఇదీ చదవండి: 'యానిమల్'లో రష్మిక కంటే హైలైట్ అయిన బ్యూటీ.. ఈమె ఎవరంటే?)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement