హీరోగా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్‌.. రిలీజ్ ఎప్పుడంటే? | Famous Music Director GV Prakash Kumar Latest Movie Release Goes Viral, Deets Inside - Sakshi
Sakshi News home page

Music Director Movie: యథార్థ సంఘటన ఆధారంగా యాక్షన్‌ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?

Published Fri, Jan 26 2024 1:44 PM

Famous Music Director Latest Movie Release Goes Viral - Sakshi

సంగీతదర్శకుడిగా, కథానాయకుడిగా సక్సెస్‌ఫుల్‌ పయనం చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి జీవీ.ప్రకాశ్‌కుమార్‌.  తాజాగా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాల్లో రెబల్‌ ఒకటి. నూతన దర్శకుడు నికేశ్‌ ఆర్‌ఎస్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియోగ్రీన్‌ పతాకంపై కేఈ.జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు.  జీవీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతోంది.

ఈ చిత్రంలో  జీవీ ప్రకాశ్‌కుమార్‌ విద్యార్థిగా చాలా పవర్‌ఫుల్‌ పాత్రను పోషించారు. ఈ సినిమాలో సంభాషణలు, జీవీ.ప్రకాశ్‌కుమార్‌ యాక్షన్‌ సన్నివేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇక రెబల్‌ చిత్ర టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా మిలియన్ల సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. దీంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోందని యూనిట్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రాన్ని మార్చి 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ చిత్రంలో మమతా బైజూ, కరుణాస్‌ సుబ్రమణియ శివ, షాలూ రహీమ్‌, వెంకటేశ్‌. వీపీ, ఆదిత్య భాస్కర్‌, కల్లూరి వినోద్‌, ఆదిరా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Advertisement
 
Advertisement