బిచ్చగాడు బంధాలను గుర్తు చేసింది | Sakshi
Sakshi News home page

బిచ్చగాడు బంధాలను గుర్తు చేసింది

Published Sat, May 6 2023 4:16 AM

Director R Narayana Murthy Speech At Bichagadu 2 Press Meet - Sakshi

‘‘విజయ్‌ ఆంటోని నటించిన ‘బిచ్చగాడు’ చిత్రం అన్ని బంధాలను బాగా గుర్తుచేసింది. ఆ సినిమాకి సీక్వెల్‌గా ఇప్పుడు ‘బిచ్చగాడు 2’ కూడా అలాంటి సెంటిమెంట్‌తోనే వస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమాని ప్రేక్షకులు పెద్ద హిట్‌ చేయాలి’’ అని ప్రముఖ నటుడు, దర్శక–నిర్మాత ఆర్‌. నారాయణమూర్తి అన్నారు. విజయ్‌ ఆంటోని హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘బిచ్చగాడు 2’. కావ్య థాపర్‌ హీరోయిన్‌.

ఫాతిమా విజయ్‌ ఆంటోని నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ– ‘‘మొదటి భాగంలో మదర్‌ సెంటిమెంట్‌ చూశారు.. రెండో భాగంలో సిస్టర్‌ సెంటిమెంట్‌ చూడబోతున్నారు’’ అన్నారు. ‘బిచ్చగాడు 2’ని తెలుగులో విడుదల చేస్తున్న ఉషా పిక్చర్స్‌ విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ– ‘‘ఏపీ, తెలంగాణలో తొలిసారి డిస్ట్రిబ్యూషన్‌ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘బిచ్చగాడు’ని తెలుగువారు ఎంతో ఆదరించారు.

‘బిచ్చగాడు 2’ అంతకంటే ఎక్కువగా మీకు నచ్చుతుంది’’ అన్నారు ఫాతిమా. ‘‘బిచ్చగాడు’ని తెలుగులో నేనే విడుదల చేశాను. ఆ సినిమా కంటే ‘బిచ్చగాడు 2’ ఇంకా పెద్ద హిట్‌ కావాలి’’ అన్నారు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు. నటుడు జాన్‌ విజయ్, తెలుగు అనువాద రచయిత భాష్య శ్రీ ΄ాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్‌ ఆంటోని, కెమెరా: విజయ్‌ మిల్టన్, ఓం ప్రకాష్‌.

Advertisement
 
Advertisement
 
Advertisement