దురంధర్‌ ఫ్రాంచైజీ.. ఏ ఇండియన్ సినిమాకు సాధ్యం కాని రికార్డ్‌..! | Dhurandhar is the India 1st franchise beats Pushpa Baahubali series movies | Sakshi
Sakshi News home page

Dhurandhar Movies: దురంధర్‌ ఫ్రాంచైజీ.. పుష్ప, బాహుబలి సినిమాలకు సాధ్యం కాని రికార్డ్‌..!

Apr 14 2026 6:38 PM | Updated on Apr 14 2026 7:17 PM

Dhurandhar is the India 1st franchise beats Pushpa Baahubali series movies

రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మార్చి 19న రిలీజైన ఈ సీక్వెల్‌ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గతేడాది విడుదలైన దురంధర్‌కు కొనసాగింపుగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజైన 26 రోజుల్లోనే అరుదైన ఘనత సాధించింది. రెండు పార్ట్‌లు కలిపి రూ.3 వేల కోట్లు సాధించిన మొదటి చిత్రంగా అరుదైన రికార్డ్ సృష్టించింది.

ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1712 కోట్లకు పైగా వసూళ్లతో ఇంకా రాణిస్తోంది. ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన దురంధర్ చిత్రాలు కలెక్షన్స్‌ రికార్డ్ సృష్టించాయి. ఈ రెండు సినిమాలు కలిపి బాహుబలి-2, పుష్ప-2 ఆల్‌టైమ్ కలెక్షన్స్‌ను దాటేశాయి. దురంధర్‌, దురంధర్‌-2 కలిపి బాక్సాఫీస్ వద్ద రూ.3 వేల కోట్ల మార్క్ సాధించాయి.

గతేడాది డిసెంబర్ 5న విడుదలైన దురంధర్‌ ప్రపంచవ్యాప్తంగా రూ.1,307.35 కోట్లు రాబట్టింది. ఈ ఏడాది మార్చి 19న రిలీజైన దురంధర్‌ ది రివెంజ్ కేవలం 26 రోజుల్లోనే రూ. 1,712 కోట్లు వసూలు చేసింది. ఈ రెండు చిత్రాల వసూళ్లను కలిపితే రూ. 3,019.35 కోట్లతో అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాయి.

గతంలో వచ్చిన టాలీవుడ్ బాహుబలి, పుష్ప సిరీస్‌ చిత్రాల మొత్తం వసూళ్లను దురంధర్‌ ఫ్రాంచైజీ ఎప్పుడో దాటేసింది. బాహుబలి పార్ట్-1కు రూ.650 కోట్లు రాగా.. బాహుబలి 2: రూ. 1,788 కోట్లు రాగా.. ఈ రెండు సినిమాల కలెక్షన్స్‌ రూ. 2,438 కోట్లుగా ఉంది. ఇక అల్లు అర్జున్ పుష్ప చిత్రాల విషయానికొస్తే పార్ట్-1 రూ. 350.10 కోట్లు రాబట్టగా.. పుష్ప 2:  ది రూల్ మూవీ రూ. 1,742.10 కోట్ల సాధించింది. ఈ రెండు సినిమాల మొత్తం రూ. 2,092.20 కోట్లు వచ్చాయి.

ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా ఫ్రాంచైజీ ప్రపంచవ్యాప్తంగా రూ. 3,000 కోట్ల మార్క్‌ దాటలేదు. ఈ విషయంలో దురంధర్‌ ఫ్రాంచైజీ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా 'ధురంధర్' సిరీస్‌లోని రెండు చిత్రాలు కూడా రూ. 1,000 కోట్ల క్లబ్‌లో చేరిన మొట్ట మొదటి ఇండియన్ ఫ్రాంచైజీగా నిలిచింది. మూడు నెలల గ్యాప్‌లోనే రిలీజైన రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద చరిత్ర సృష్టించాయి. మూడు వేల కోట్ల మార్క్‌తో సరికొత్త ఒరవడికి నాంది పలికాయి. 

మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన ధురంధర్: ది రివెంజ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి రాణిస్తోంది. చైనా, గల్ఫ్ దేశాల్లాంటి అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల కాకుండానే ఈ గణాంకాలను సాధించడం దురంధర్‌కే సాధ్యమైంది. ఈ లెక్కన భారతీయ సినిమా ముఖ చిత్రాన్ని దురంధర్‌ మార్చేసింని చెప్పొచ్చు. సినీ ఇండస్ట్రీని షేక్‌ చేసిన దురంధర్‌ పేరు బాక్సాఫీస్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement