మైనర్‌ బాలికతో అసభ్య ప్రవర్తన.. ‘ఢీ’ కొరియోగ్రాఫర్‌పై పోక్సో కేసు, అరెస్ట్‌! | Dhee Show Fame Krishna Master Arrested In Pocso Case | Sakshi
Sakshi News home page

మైనర్‌ బాలికతో అసభ్య ప్రవర్తన..‘ఢీ’ కొరియోగ్రాఫర్‌ అరెస్ట్‌!

Aug 3 2025 1:04 PM | Updated on Aug 3 2025 3:04 PM

Dhee Show Fame Krishna Master Arrested In Pocso Case

ఢీ’ ఫేం కొరియోగ్రాఫర్కృష్ణ మాస్టర్పై పోక్సో కేసు నమోదు అయింది. మైనర్బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో అతనిపై గచ్చిబౌలి పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్చేశారు. అనంతరం అతన్ని కంది జైలుకు తరలించారు. 

మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ గత నెలలో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పొక్సో కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే విషయం తెలుసుకున్న కృష్ణ.. వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. బెంగళూరిలోని తన అన్న నివాసంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో అక్కడి వెళ్లి అరెస్ట్‌ చేసి  అనంతరం కంది జైలుకు తరలించారు.

ఇటీవల కృష్ణకు మహిళతో వివాహం కూడా జరిగింది. భార్యకు సంబంధించిన రూ. 9.50 లక్షల నగదు తీసుకొని కృష్ణ బెంగళూరికి వెళ్లినట్లు తెలుస్తంది. గతంలో కూడా కృష్ణపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ద్వారా పలువురు యువతుల్ని మోసం చేసినట్లు కృష్ణపై అభియోగాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement