గోవాలో మాఫియా | Sakshi
Sakshi News home page

గోవాలో మాఫియా

Published Mon, Feb 5 2024 12:16 AM

Dhanush and Nagarjuna project heading for the new schedule - Sakshi

ధనుష్‌ హీరోగా దర్శకుడు శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ముంబై నేపథ్యంతో మాఫియా యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నాగార్జున ఓ లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ తిరుపతిలో ప్రారంభమైంది.

కాగా ఈ చిత్రం నెక్ట్స్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ గోవాలో జరగనున్నట్లు తెలిసింది. దాదాపు రెండు వారాలపాటు సాగే ఈ షెడ్యూల్‌లో ధనుష్, నాగార్జున కాంబినేషన్‌లోని సన్నివేశాలను చిత్రీకరిస్తారట దర్శకులు శేఖర్‌ కమ్ముల. ఈ షెడ్యూల్‌లోనే రష్మికా మందన్నా కూడా జాయిన్‌ అవుతారట. సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement