Devatha : స్వార్థంగా ఆలోచిస్తున్న సత్య.. రుక్మిణిని అడ్డు పెట్టుకొని..

Devatha Serial : Satya Shares Her Grief With Rukmini - Sakshi

సత్యను చూడటానికి రుక్మిణి దేవుడమ్మకు చెప్పెకుండా వాళ్లింటికి వెళ్తుంది. నిజం తెలిసిన దేవుడమ్మ రుక్మిణిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరోవైపు తన తల్లిదండ్రులు రుక్మిణి వల్లే చనిపోయారన్న నిజం తెలిసినప్పటి నుంచి సత్య స్వార్థంగా ఆలోచిస్తుంది.  రుక్మిణిని అడ్డం పెట్టుకొని దేవుడమ్మ ఇంటికి ఎలా వెళ్లాలా అని ప్లాన్‌ చేస్తుంటుంది.ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ విశేషాలతో దేవత సీరియల్‌ మే25న 242వ ఎపిసోడ్‌లోకి ఎంటర్‌ అయ్యింది. ఇవాల్టి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..

సత్యను ఎలా కలవాలో తెలియక రుక్మిణి మదనపడుతుంటుంది. దేవుడమ్మను అడిగినా ఎలాంటి ప్రయోజనం ఉండదని అర్థమవుతుంది. ఈలోగా కనకం వచ్చి దేవుడమ్మకు తెలియకుండా వెళ్లి వచ్చేయమని సలహా ఇస్తుంది. అప్పటివరకు ఇంట్లో తాను మ్యానెజ్‌ చేస్తానని చెప్పి రుక్మిణిని వాళ్లింటికి పంపిస్తుంది. ఇక సత్యను చూడగానే రుక్మిణి కన్నీటి పర్యంతమవుతుంది. సత్యను ఇలా ముభావంగా ఉండొద్దని ఎప్పటికప్పుడు భోజనం తిని మందులు వేసుకోవాలని చెప్తుంది.

ఇక తన తల్లిదండ్రులు రుక్మిణి వల్లే చనిపోయారన్న నిజం తెలిసినప్పటి నుంచి సత్య స్వార్థంగా ఆలోచిస్తుంది.  రుక్మిణిని అడ్డం పెట్టుకొని దేవుడమ్మ ఇంటికి ఎలా వెళ్లాలా అని ప్లాన్‌ చేస్తుంటుంది. మరోవైపు రుక్మిణి ఇంట్లో లేదన్న నిజం దేవుడమ్మకు తెలిసిపోతుంది. భాగ్యమ్మకు ఫోన్‌ చేసి కనుక్కోగా రుక్మిణి అక్కడే ఉందని చెప్పడంతో దేవుడమ్మ కోప్పడుతుంది. అయితే రుక్మిణి తప్పేం ఉండకపోవచ్చని, భయం వల్ల తను అలా చేసిందేమో అని ఆదిత్య రుక్మిణిని వెనకేసుకొని వస్తాడు. 


 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top