Devatha : రుక్మిణి ప్రవర్తనపై విసుగు చెందిన సత్య

Devatha Serial: Satya And Rukmini Get Into An Argument - Sakshi

దేవత సీరియల్‌ 268వ ఎపిసోడ్‌ ప్రత్యేకం

రుక్మిణి సత్యపై అతి ప్రేమ కురిపిస్తుంటుంది. ఈ క్రమంలో ఆదిత్యను నిర్లక్ష్యం చేస్తుంది. ఇదే విషయంపై దేవుడమ్మ రుక్మిణిని నిలదీస్తుంది. మరోవైపు దీని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు అని ఆదిత్యకు సలహా ఇస్తుంది. సీన్‌కట్‌ చేస్తే రుక్మిణి ప్రవర్తనపై సత్య కూడా ఇబ్బంది పడుతుంది. ఇలా ఎందుకు చేస్తున్నావంటూ ప్రశ్నిస్తుంది. అంతేకాకుండా తన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకోవద్దని హితవు పలుకుతుంది. మరోవైపు  ఓ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని చెప్పి రుక్మిణి ఆదిత్యను సత్య గదిలోకి పిలుస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ విశేషాలను ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. దేవత సీరియల్‌ జూన్‌ 24న 268వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..


ఆదిత్యను నిర్లక్ష్యం చేస్తూ రుక్మిణి సత్యపై అతి ప్రేమ చూపిస్తుంటుంది. దీన్ని గమనించిన దేవుడమ్మ సత్యపై ప్రేమ ఉండొచ్చు గానీ నీ భర్తను పట్టించుకోకపోవడం ఏంటని నిలదీస్తుంది. ఇక రుక్మిణి ప్రవర్తనను చూసి ఆదిత్య కూడా బాధపడతాడు. సీన్‌కట్‌ చేస్తే దేవుడమ్మ, ఈశ్వర్‌ ప్రసాద్‌ వెళ్లి ఆదిత్యకు నచ్చజెప్పుతారు. రుక్మిణి అలా చేసిందని మనసు నొచ్చుకోవద్దు అని చెబుతూనే, రుక్మిణిపై కోప్పడొద్దని చెబుతుంది. వారి ప్రేమకు ఇది అడ్డు రాకూడదని హితవు పలుకుతుంది. అయితే దేవుడమ్మ తనపై చూపిస్తున్న ప్రేమ, నమ్మకాన్ని వమ్ము చేస్తున్నానని ఆదిత్య బాధపడతాడు.


తన వల్ల ఇంత తప్పు జరిగినందుకు తనలో తానే మదనపడతాడు. మరోవైపు రుక్మిణి తనపై చూపిస్తున్న అతిప్రేమను చూసి సత్య చిరాకు పడుతుంది. ఆదిత్యను నిర్లక్ష్యం చేస్తూ ఏం సాధించాలనుకుంటున్నావ్‌ అని రుక్మిణిని నిలదీస్తుంది. చేతులారా జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కోరుతుంది. ఇంతలోనే ఆదిత్య అక్కడకు వచ్చి తనను ఎందుకు పిలిచావని రుక్మిణిని అడుగుతాడు. ఇలా అమ్మ చూస్తే ఏం అనుకుంటుంది అని ప్రశ్నిస్తాడు. చూస్తే చూడని, ఎందుకు భయపడుతున్నావ్‌ పెనిమిటి అని రుక్మిణి బదులిస్తుంది. మరి రుక్మిణి ఆలోచన ఏంటి? సత్య- ఆదిత్యలను కలపాలన్న నిర్ణయాన్ని వాళ్లకు చెబుతుందా అన్నది తర్వాతి ఎపిసోడ్‌లో చూద్దాం. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top