సత్య-ఆదిత్యల ప్రేమ విషయం నందా చెప్పేస్తాడా?

Devatha Serial : Rukhmini Exposes Nandas True Colours To Devudamma - Sakshi

నందా నిజస్వరూపం గురించి పూస గుచ్చినట్లు వివరించిన సత్య. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం ఎవరు అని ప్రశ్నించిన రుక్మిణి. నందాను ఇంట్లోంచి బయటకు గెంటేసిన రుక్మిణి. ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ విశేషాలతో దేవత సీరియల్‌ 234వ ఎపిసోడ్‌లోకి ఎంటర్‌ అయ్యింది. ఇవాల్టీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..

నందా బండారం బయటపడింది. ఇన్ని రోజులుగా నందా పెడుతున్న టార్చర్‌ గురించి సత్య రుక్మిణితో చెబుతుంది. తామిద్దరికీ ఏ సంబంధం లేదని, అనుకోని పరిస్థితుల్లో నందా తనకు కనపించాడని, తన అనుమతి లేకుండానే నందా తన లైఫ్‌లోకి వచ్చాడని బయటపెట్టేస్తుంది. అయితే తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రెవరు అన్న నిజాన్ని మాత్రం చెప్పదు. ఇక నందా గురించి తెలుసుకున్న రుక్మిణి కోపంతో రగిలిపోతుంది. నందా తలకు కొడవలి పెట్టి తాను చెప్పినట్లుగా ఓ పేపర్‌లో రాయమని చెప్తుంది రుక్మిణి. ఊహించని పరిణామంతో షాకైన నందా రుక్మిణి చెప్పినట్లు చేస్తాడు.

ఇక నందాను ఇంట్లోంచి బయటకు గెంటేస్తుంటే దేవుడమ్మ ఎంట్రీ ఇస్తుంది. ఏం జరిగిందంటూ ప్రశ్నించగా నందా బండారం మొత్తం బయపెట్టేస్తుంది రుక్మిణి. సత్య కోసం 2 లక్షలు పెట్టి నగ తెచ్చి ఎంతో ప్రేమ ఉన్నట్లు నటించాడని, అది గిల్టు నగ అని తేలిపోయి, నందా చరిత్ర బయటపడిందని వివరిస్తుంది.  సత్యని ఢోకా చేయడానికి ఇక్కడకి వచ్చాడని, తనకున్న అప్పులు తీర్చుకునేందుకు ఈ పథకం రచించినట్లు వివరిస్తుంది. ఒక నందా అసలు స్వరూపం తెలుసుకన్న దేవుడమ్మ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? కోపంతో నందా సత్య-ఆదిత్యల ప్రేమ విషయం బయటకు చెప్పేస్తాడా అన్నది తర్వాతి ఎపిసోడ్‌లో తేలనుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top