ఓటీటీలోకి హారర్- థ్రిల్లర్ సినిమా.. తెలుగులో కూడా చూసేయండి | Conjuring Kannappan Movie Streaming On Netflix From 5th January 2024 - Sakshi
Sakshi News home page

ఓటీటీలోకి హారర్- థ్రిల్లర్ సినిమా.. తెలుగులో కూడా చూసేయండి

Published Sun, Dec 31 2023 3:16 PM

Conjuring Kannappan In Netflix Streaming On January 5th - Sakshi

కోలీవుడ్‌లో ఈ ఏడాది వచ్చిన చిత్రాల్లో 'కంజూరింగ్ కన్నప్పన్' సూపర్‌ హిట్‌ కొట్టింది. సెల్విన్ రాజ్ జేవియర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సతీష్, రెజీనా, నాసర్, శరణ్య ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. హారర్-థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ టాక్‌తో మంచి కలెక్షన్స్‌ సాధించింది.

డిసెంబర్ 8, 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయిన ఈ చిత్రం. ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా జనవరి 5 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. కేవలం తమిళ్‌లో మాత్రమే బిగ్‌ స్క్రీన్‌లో విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో మాత్రం తెలుగు, మలయాళం, కన్నడలో కూడా విడుదల కానుంది.

కథ : గేమింగ్ ఇండస్ట్రీపై చాలా ఆసక్తి ఉన్న సతీష్ ఉద్యోగం కోసం పలు ప్రయత్నాలు చేస్తు ఉంటాడు. అతను డ్రీమ్ క్యాచర్ అని పిలువబడే మంత్రముగ్ధమైన వస్తువును తీసుకొని దాని నుంచి అద్భుతాలు క్రియేట్‌ చేస్తాడు. అలా సతీష్ నిద్రలోకి జారుకున్నప్పుడల్లా స్వప్న ప్రపంచంలో దెయ్యం వలలో చిక్కుకుంటాడు. చివరికి అతని కుటుంబం తనలాగే చిక్కుకుపోవడంతో ఏం జరిగిందనేది సినిమా.. కామెడీ- హారర్‌తో పాటు ఇందులో థ్రిల్లింగ్‌ తెప్పించే సన్నివేశాలు కూడా ఉంటాయి.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement