కుంటాల సందర్శన.. అల్లు అర్జున్‌పై ఫిర్యాదు | Complaint Against On Allu Arjun Over His Kuntala Waterfalls Visit | Sakshi
Sakshi News home page

కుంటాల సందర్శన.. అల్లు అర్జున్‌పై ఫిర్యాదు

Sep 17 2020 6:42 PM | Updated on Sep 17 2020 6:59 PM

Complaint Against On Allu Arjun Over His Kuntala Waterfalls Visit - Sakshi

సినీ హీరో అల్లు అర్జున్‌ ఇటీవల కుటుంబ సమేతంగా ఆదిలాబాద్‌లోని కుంటాల జలపాతాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్‌లో భాగంగా బన్నీ జిల్లాలో పర్యటించగా అతనితో సెల్ఫీ దిగేందుకు అభిమానులు పోటీలు పడ్డారు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్‌ కుంటాల సందర్శన వివాదంగా మారింది. కరోనా నేపథ్యంలో పర్యాటకులను అనుమతించని అధికారులు.. ప్రముఖులకు మాత్రం మర్యాదలు చేయడం ఏమిటరి విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా కరోనా నిబంధనలు ఉల్లఘించి కుంటాల జలపాతాన్ని సందర్శించారని అల్లు అర్జున్‌పై  నేరడిగొండ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. (అల్లు అర్జున్‌తో సెల్ఫీ కోసం పోటీలు..)

బన్నీ పర్యటనకు కారణం కోరుతూ సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. కోవిడ్‌ నేపథ్యంలో కుంటాల జలపాత సందర్శనను ప్రభుత్వం నిలిపి వేసిందని, అలాంటి సమయంలో అల్లు అర్జున్‌ ఎలా పర్యటించారో కారణం తెలపాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తిప్పేశ్వర్‌లో అనుమతులు లేకున్నా పుష్ప సినిమా షూటింగ్ చేశారని సమాచార హక్కు సాధన స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవులపల్లి కార్తిక్‌రాజు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన నేరడిగొండ పోలీసులు, దీనిపై ప్రాథమిక విచారణ అనంతరం కేసు నమోదు చేయాలా వద్దా అని నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందన్నారు. (అల్లు అర్జున్‌కు ఎలా అనుమతి ఇచ్చారు?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement