
బిగ్‌బాస్ షో వల్ల బాగా పాపులర్ అయిపోయిన అమర్ దీప్ హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం 'చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి'. ఇందులో హీరోయిన్‌గా సురేఖా వాణి కూతురు సుప్రీత నటిస్తుంది. తాజాగా ఈ మూవీ నుంచి సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి మాల్యాద్రి రెడ్డి (Malyadri Reddy) దర్వకత్వం వహించారు. మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాతగా ఉన్నారు. రాశి, వినోద్‌కమార్, సురేఖవాణి, రాజారవీంద్ర వంటి నటీనటులు ఇందులో నటిస్తున్నారు. బండి సత్యం రచించిన ఈ పాటను రఘు కుంచే ఆలపించారు. సంగీతం కె.వి.జె.దాస్ అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో విడుదల కానుంది.