Chiranjeevi's Waltair Veerayya box office collection Day 1 - Sakshi
Sakshi News home page

Waltair Veerayya 1st Day Collections: దుమ్ములేపుతున్న వాల్తేరు వీరయ్య.. ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయంటే!

Jan 14 2023 5:08 PM | Updated on Jan 14 2023 6:02 PM

Chiranjeevi Waltair Veerayya 1st Day Box Office Collections - Sakshi

ఈ సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్‌తో దుమ్ములేపుతున్నాడు వాల్తేరు వీరయ్య. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా శుక్రవారం(జనవరి 13న) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా డైరెక్టర్‌ బాబీ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమా మాస్‌ హిట్‌ను అందుకుంది. విడుదలైన తొలి షో నుంచే ఈ మూవీ పాజిటివ్‌ తెచ్చుకుంది.

చదవండి: నేను ఆ డిజార్డర్‌తో బాధపడుతున్నా! షాకిచ్చిన అనసూయ..

ఇందులో మెగాస్టార్‌ మాస్‌, యాక్షన్‌, కమెడీకి ప్రేక్షకులంత ఈళలు వేస్తూ రచ్చ రచ్చ చేశారు. దీనికి తోడు రవితేజ మాస్‌ యాక్షన్‌ జత కావడంతో ఇక ఫ్యాన్స్‌ జోరు ఆకాశాన్ని తాకింది. అలా తొలి రోజు ఈ మూవీ బాక్సాఫీసు వద్ద వసూళ్లతో సత్తా చాటింది వాల్తేరు వీరయ్య.  తొలిరోజు వరల్డ్ వైడ్ రూ. 29 కోట్ల గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో రూ. 23 పైగా కోట్లు షేర్‌ చేసినట్లు ట్రేడ్‌ వర్గాల నుంచి సమాచారం.  

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్‌ ఇలా ఉన్నాయి:
నైజాం- రూ.6.10 కోట్లు
సీడెడ్- రూ.4.20 కోట్లు
ఉత్తరాంధ్ర- రూ.2.60 కోట్లు
ఈస్ట్‌- రూ.2.68 కోట్లు
వెస్ట్‌- రూ.2.06 కోట్లు
కృష్ణా- రూ.1.49 కోట్లు
గుంటూరు- రూ.2.76 కోట్లుఔ
నెల్లూరు- 1.05 కోట్లు

ఇలా వాల్తేరు వీరయ్య తోలి రోజు బాక్సాఫీసు వద్ద వసూళ్లు కురిపించింది. ఇక రెండో రోజు ఈ మూవీ అదే జోరును కొసాగిసోందట. శనివారం వాల్తేరు వీరయ్య అన్ని షోలు హౌజ్‌ ఫుల్‌ బకింగ్‌ ఉన్నట్లు సమాచారం. కాగా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ సినిమాలో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటించింది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు సంగీతం అందించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement