Anasuya Bharadwaj: నేను ఆ డిజార్డర్‌తో బాధపడుతున్నా! షాకిచ్చిన అనసూయ..

Anasuya Bharadwaj Reveals Her Disorder on Her Latest Instagram Post - Sakshi

అనసూయ భరద్వాజ్‌.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్‌గా నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఆమె. తరచూ తన గ్లామరస్‌ ఫొటోలు, వ్యక్తిగత విషయాలను పంచుకునే అనసూయకు సోషల్‌ మీడియాలో మంచి క్రేజ్‌ ఉంది. నెట్టింట ఆమెకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎంత ఉందో.. అంతేస్థాయలో విమర్శకులు కూడా ఉన్నారు. నిత్యం తనని టార్గెట్‌ చేస్తూ సోషల్‌ మీడియా వేదికగా అనసూయపై దారుణంగా కామెంట్స్‌ చేస్తూ ట్రోల్‌ చేస్తుంటారు.

చదవండి: ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో క్రేజీ మూవీ, నలుగురు హీరోలతో..

ఇక ఈ ట్రోల్స్‌పై అనసూయ ఘాటుగా స్పందించి వివాదంలో చిక్కుకుంటుంది. ఇలా తరచూ ట్రోల్స్‌, వివాదాలతో వార్తల్లో నిలిచే ఆమె రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్‌ చేసింది. ఇందులో తను ఓ డిజార్డర్‌తో బాధపడుతున్నానని చెప్పింది. ‘నా గురించి నెగెటివ్‌గా మాట్లాడే వారిని అస్సలు లెక్కచేయను. వారి గురించి పట్టించుకోవకపోవడమే నా రుగ్మత’ అంటూ రీల్‌ వీడియో షేర్‌ చేసి షాకిచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్‌ నెట్టింట చర్చనీయాంశమైంది. మరోసారి తనని టార్గెట్‌ చేస్తూ నెగిటివ్‌ కామెంట్స్‌ చేసేవారికి అనసూయ పరోక్షంగా గట్టి కౌంటర్‌ ఇచ్చిందని ఆమె ఫాలోవర్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి: తమిళనాడు రాజకీయ విభేదాలపై డైరెక్టర్‌ సంచలన వ్యాఖ్యలు

కాగా ‘రంగస్థలం’ చిత్రంలో తన పాత్రతో రంగమ్మత్తగా వెండితెరపై మంచి గుర్తింపు పొందిన అనసూయ వరుస సినిమాలతో బిజీగా ఉంది.  పాన్‌ ఇండియా చిత్రం పుష్పలో ద్రాక్షాయణిగా నెగిటివ్‌ రోల్‌లో మెప్పించిన ఆమె చేతిలో ప్రస్తుతం పుష్ప2, కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాలు ఉన్నాయి. అలాగే గురజాడ అప్పారావు నాటకం ‘కన్యాశుల్కం’ నవల ఆధారంగా తెరెకెక్కితోన్న కన్యాశుల్కం అనే వెబ్‌సిరీస్‌లోనూ ఆమె నటిస్తోందట. ఇందులో అనసూయ వేశ్య పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top