
చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న చిత్రం టైటిల్‌ను ప్రకటించారు. నేడు మెగాస్టార్ బర్త్‌డే సందర్బంగా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. 'మన శంకరవరప్రసాద్ గారు' అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఆపై పండగకి వస్తున్నారు అంటూ ఒక ట్యాగ్‌లైన్ ఇచ్చారు. చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్‌తో ఈ చిత్రం పేరు ముడిపడేలా ఉండటంతో అభిమానులో సంతోషిస్తున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతుంది.
చిరంజీవికి జంటగా లేడీ సూపర్‌స్టార్ నయనతార నటిస్తుంది. ఈ సినిమా భార్యాభర్తల రిలేషన్‌పై ఆధారంగా ఉంటుందని అనిల్ రావిపూడి గతంలో అన్నారు. దీనిలో 70 శాతం కామెడీ, 30 శాతం ఎమోషనల్ డ్రామా ఉంటుందన్నారు. చిరంజీవిని ఇటీవలి కాలంలో ఎవరూ చూపించని కొత్త లుక్‌లో ప్రజెంట్ చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.