Bigg Boss 6 Telugu: నా వల్ల ప్రాబ్లమ్‌ అయితే నన్ను పంపించేయండి: రేవంత్‌

Bigg Boss Telugu 6: Singer Revanth Frustrated and Argue With Arohi Rao - Sakshi

బిగ్‌బాస్‌ అంటేనే కొట్లాట అన్నట్లు ఉంది ప్రస్తుతం హౌస్‌ పరిస్థితి. నామినేషన్స్‌ను అందరూ లైట్‌ తీసుకున్నా రేవంత్‌ మాత్రం బాగా హర్ట్‌ అయినట్లు కనిపించాడు. అవును మ హౌస్‌లో అతడికే కదా ఎక్కువ నామినేషన్‌ ఓట్లు పడ్డాయి. ఫలితంగా ఆ ఫ్రస్టేషన్‌ను ఈరోజు కూడా కొనసాగించడంతో అందరితో గొడవలు పడ్డాడు. తన వాదన కరెక్ట్‌గానే ఉన్నా సీరియస్‌గా చెప్పడంతో అతడే ఏదో తప్పు చేస్తున్నట్లు చూశారు మిగతా హౌస్‌మేట్స్‌. మరి ఈ రోజు హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయి? ఎవరు ప్లాన్‌గా గేమ్‌ ఆడుతున్నారు? అనేది బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌లోని ఐదో ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చదివేద్దాం.

నిన్నటి నామినేషన్‌ ప్రక్రియలో ఆరోహి తనను బాడీ షేమింగ్‌ చేసిందని కన్నీళ్లు పెట్టుకుని మరీ చెప్పింది మెరీనా. ఈరోజుమాత్రం నిజానిజాలేంటో ఆరా తీసిన తర్వాత తన మాటను వెనక్కు తీసుకుంది. తను మాట్లాడినదాన్ని తప్పుగా అర్థం చేసుకున్నానని అందరి ముందు క్లారిటీ ఇచ్చింది. ఇక రేవంత్‌ పరిస్థితి చూసిన గీతూ అతడి మీద జోకులేసింది. 'ఆయన మరీ అమాయకంగా ఉన్నాడు. ఆయన ఎంత త్వరగా వెళ్లిపోతే ఆయనకే మంచిది. మారేట్లు కూడా అనిపించడం లేదు' అని అభిప్రాయపడింది.

భార్యాభర్తలైన మెరీనా-రోహిత్‌ ఎప్పటిలాగే గొడవపడ్డారు. రోహిత్‌ తనతో కాసేపు వాకింగ్‌ చేయమంటే పట్టించుకోకుండా శ్రీసత్యతో వెళ్లిపోయాడంటూ గొడవకు దిగింది మెరీనా. నా భర్తతో నేను వాకింగ్‌ చేయొద్దా అంటూ రాద్ధాంతం చేసి రచ్చ చేసి ఏడ్చి ఇదంతా ప్రాంక్‌ అనేసింది. కానీ అప్పటికే అదంతా నాటకం అని మిగతా హౌస్‌మేట్స్‌కు అర్థమవడంతో ఆ ప్రాంక్‌ పెద్దగా పేలలేదు. ఎవరేం చేస్తున్నారా? అని అందరి మీద ఓ కన్నేసిన చంటి.. గీతూ సరిగా పని చేయదు, కానీ పక్కనోళ్లకు మాత్రం పని చెప్తుందని అసహనానికి లోనయ్యాడు.

అనంతరం బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులను రెండు టీమ్స్‌గా విడిపోమని చెప్పి డీస్నీ హాట్‌స్టార్‌ గేమ్‌ ఆడించాడు. ఇందులో సినిమాకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ఆరోహి, రేవంత్‌, పింకీ, మెరీనా, రోహిత్‌, ఫైమా, అభినయ, ఆదిరెడ్డి, వాసంతి, షని.. A టీమ్‌ కాగా మిగతా వారంతా B టీమ్‌లో ఉన్నారు. B టీమ్‌ తరపు నుంచి ఆడేందుకు నేను వెళ్తానంటే నేను వెళ్తానని ఆరోహి, రేవంత్‌ పోటీపడ్డారు. చివరికి ఆరోహి పోటీలో పాల్గొనేందుకు వెళ్లింది. అయితే ఈ గేమ్‌లో B టీమ్‌ గెలవడంతా వారు స్పెషల్‌ గిఫ్ట్‌ అందుకున్నారు. A టీమ్‌ సభ్యుడైన రేవంత్‌ మాత్రం డిసప్పాయింట్‌ అయ్యాడు. రెండుసార్లు నేను వెళ్తానంటే కూడా వినిపించుకోకుండా ఆరోహి వెళ్లిందని, చివరికి గేమ్‌ ఓడిపోయామని చిటపటలాడాడు. అతడి మాటలతో హర్ట్‌ అయిన ఆరోహి నాతో మాట్లాడకు అంటూ వేలెత్తి చూపించి పౌరుషంగా అక్కడినుంచి వెళ్లిపోయి బోరుమని ఏడ్చేసింది.

ఇదెక్కడి గోలరా బాబు, ఇప్పుడేమన్నానని ఇంత సీన్‌ అనుకున్న రేవంత్‌ కెమెరా ముందుకెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు. 'నా వల్ల ప్రాబ్లమ్‌ అనుకుంటే నన్ను పంపించేయండి. అంతేకానీ ఇలా నటిస్తూ ఒకర్ని సంతోషపెట్టడం కోసం నా క్యారెక్టర్‌ను నేను చంపుకోలేను. ఇక్కడ చాలామంది గ్రూప్‌గా ఆడుతున్నారు. నేను సింగిల్‌గా ఆడతా, ఎన్నిరోజులైనా ఆడతా. ఇంత సిన్సియర్‌ పీపుల్‌ మధ్య నేను అర్హుడిని కాదేమో, ఈ నిమిషమే నన్ను పంపించేయండి.  ఇలా యాక్ట్‌ చేస్తూ బతకడం రాదు' అని చెప్పాడు. కానీ రాత్రయ్యేసరికి ఆరోహి రేవంత్‌ దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది. అయినా వీరి గొడవ సద్దుమణిగినట్లు కనిపించలేదు.

ఫ్రస్టేషన్‌ పీక్స్‌లో ఉన్న రేవంత్‌ తన మనసులో ఉన్న ఆవేశాన్ని బయటకు కక్కుతూ.. నేనేంటో చూపిస్తా అన్నాడు. ఆ పాయింట్‌ పట్టుకున్న ఆదిరెడ్డి వెంటనే మధ్యలో దూరి ఇ​క్కడ అందరూ సమానమే అని వాదనకు దిగుతూ రేవంత్‌ను రెచ్చగొట్టినట్లు అనిపించింది. . దీంతో రేవంత్‌ నేనేం సోషల్‌ మీడియా నుంచి రాలేదు అని నోరు జారాడు. అంటే సోషల్‌ మీడియా నుంచి వచ్చినవాళ్లు చులకనగా కనిపిస్తున్నారా? అని ఆదిరెడ్డి ప్రశ్నించాడు. అలా వీరి గొడవ పెద్ద జడివానలా మారేట్లు ఉందని గ్రహించిన శ్రీహాన్‌ రేవంత్‌ను హౌస్‌లోకి తీసుకెళ్లాడు. ఇక ఈరోజంతా గొడవలు పడి మైండ్‌ హీటెక్కిన రేవంత్‌ను పెదరాయుడు బాలాదిత్య ఎప్పటిలాగే అతడిని కూర్చోబెట్టుకుని నాలుగు మంచి మాటలు చెప్తూ అతడి మైండ్‌ కూల్‌ చేశాడు. 

చదవండి: చిన్నప్పుడే అమ్మ చనిపోవడంతో కూలీ పనులకు వెళ్లేదాన్ని
ట్విస్ట్‌, ఒక్కరు కాదు ఇద్దరు ఎలిమినేట్‌ అవుతారట

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top