బిగ్‌బాస్‌ నుంచి మరో లీక్‌, సెకండ్‌ కెప్టెన్‌గా కండల వీరుడు | Bigg Boss Telugu 5: Vishwa Second Captain Of The Bigg Boss House | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: గద్ద టీమ్‌ గెలుపు! అతడే సెకండ్‌ కెప్టెన్‌!

Sep 15 2021 8:27 PM | Updated on Sep 15 2021 9:32 PM

Bigg Boss Telugu 5: Vishwa Second Captain Of The Bigg Boss House - Sakshi

టాస్కు గెలిచేందుకు ఓ రకంగా యుద్ధమే చేస్తున్నారు కంటెస్టెంట్లు. స్నేహితులుగా ఉన్నవాళ్లు కూడా గేమ్‌లో బద్ధ శత్రువులుగా మారిపోయారు. మొత్తానికి...

Bigg Boss Telugu 5, Second Week Captain: టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున చెప్పినట్లు బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ ప్రేక్షకులకు ఐదు రెట్ల ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తోంది. ముఖ్యంగా మగవాళ్లకన్నా లేడీ కంటెస్టెంట్లు టాస్కుల్లో తమ ప్రతాపాన్ని చూపిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు బూతులు కూడా మాట్లాడి అప్రతిష్ట మూటగట్టుకుంటున్నారు. ప్రస్తుతం హౌస్‌లో కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక కోసం టాస్క్‌ నడుస్తోంది.

ఇందుకోసం ఇంటిసభ్యులు గద్ద( లోబో, యానీ మాస్టర్‌, శ్రీరామ్‌, ప్రియ, హమీదా, విశ్వ, సిరి, షణ్ముఖ్‌, ప్రియాంక), నక్క(ఉమాదేవి, లహరి, రవి, జెస్సీ, మానస్‌, సన్నీ, కాజల్‌, శ్వేత, నటరాజ్‌) టీములుగా విడిపోయారు. టాస్కు గెలిచేందుకు ఓ రకంగా యుద్ధమే చేస్తున్నారు కంటెస్టెంట్లు. స్నేహితులుగా ఉన్నవాళ్లు కూడా గేమ్‌లో బద్ధ శత్రువులుగా మారిపోయారు. మొత్తానికి బిగ్‌బాస్‌ ఇచ్చిన ఈ టాస్కులో గద్ద టీమ్‌ గెలిచినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ టీములో నుంచి విశ్వ కెప్టెన్‌గా ఎంపికైనట్లు ఓ వార్త లీకైంది. మొదటి వారంలో రేషన్‌ మేనేజర్‌గా కొనసాగిన విశ్వ రెండో వారంలో కెప్టెన్‌ అయ్యాడా? లేదా? అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement